తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Vs Congress : కేసీఆర్‌ ఫాంహౌస్‌ దగ్గర దీక్ష చేస్తా : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

BRS vs Congress : కేసీఆర్‌ ఫాంహౌస్‌ దగ్గర దీక్ష చేస్తా : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

05 October 2024, 15:56 IST

google News
    • BRS vs Congress : రైతు రుణమాఫీపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. రుణమాఫీ కోసం రాహుల్ గాంధీ ఇంటి ఎదుట దీక్ష చేస్తామని హరీశ్ రావు ప్రకటించారు. ఆయన కామెంట్స్‌పై తాజాగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి రియాక్ట్ అయ్యారు. తాను కేసీఆర్ ఫాంహౌజ్ దగ్గర చేస్తానని ప్రకటించారు.
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి (@ImJaggaReddy)

కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

పది నెలల కాంగ్రెస్ పాలనలో.. రేవంత్ రెడ్డికి రైతులు, ప్రజలు అంటే పట్టింపు లేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రైతు ధర్నా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. రైతు బంధు, రుణమాఫీ, పింఛన్లు, మహాలక్ష్మి అన్ని చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు చప్పుడు చేయటం లేదని విమర్శలు గుప్పించారు.

“రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రేవంత్ రెడ్డి కనిపించడం లేదా? అన్ని పంటలకు బోనస్ అని ఇప్పుడు సన్నాలకు మాత్రమే ఇస్తున్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి. డిఏ లు ఇవ్వక ఉద్యోగులను మోసం చేస్తున్నారు. అన్ని వర్గాలకు రేవంత్ రెడ్డి అన్యాయమే చేశాడు. రేవంత్ రెడ్డి సర్కార్ మెడల వంచి మీకు రుణమాఫీ అమలు చేయిస్తాం. దసరా తరవాత రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం. రుణమాఫీ అమలు చేయిస్తాం” అని హరీశ్ రావు కామెంట్స్ చేశారు.

హరీశ్ రావు చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. “హరీశ్ రావు రాహుల్‌ గాంధీ ఇంటిముందు ధర్నా చేస్తా అంటున్నాడు. ఆనాడు దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కేసీఆర్‌ కుటుంబం. ఒక్క హామీ కూడా అమలు చేయని నువ్వు.. రాహుల్‌గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తా అంటే ఊరుకుంటామా.? నువ్వు.. నీ మామ మోసాల కుటుంబం.. ప్రజలను మోసం చేసినందుకు కేసీఆర్‌ ఫాం హౌస్‌ దగ్గర దీక్ష చేస్తా.. నువ్వు ఢిల్లీ పోయిన రోజే నేను మీ మామ ఎక్కడ ఉంటే అక్కడ దీక్ష చేస్తా” అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

“వరంగల్ వచ్చి డిక్లరేషన్ ప్రకటించారు. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఏడాదికి ఎకరాకు రూ. 15 వేలు అన్నారు.. ఇప్పటికి కాలేదు. రైతు కూలీలు, భూమి లేని రైతులకు పంట బీమా పథకం అన్నారు. అది కూడా కాలేదు. పోడు, అసైండ్ భూములకు యాజమాన్య హక్కులు ఇస్తామన్నారు. అన్ని రకాల పంటలకు 500 బోనస్ అని, ఇప్పుడు సన్నాలకి మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రేవంత్ రెడ్డి దయ వల్ల రాహుల్ గాంధీ మీద నమ్మకం లేకుండా పోతుంది. వరంగల్ రైతు డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేదు” అని హరీశ్ రావు ప్రశ్నించారు.

తదుపరి వ్యాసం