తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Musi River Yatra : సీఎం రేవంత్ 'మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర' - టూర్ షెడ్యూల్ వివరాలివే

CM Revanth Musi River Yatra : సీఎం రేవంత్ 'మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర' - టూర్ షెడ్యూల్ వివరాలివే

07 November 2024, 20:42 IST

google News
    • CM Revanth Musi River Yatra : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రకు సిద్ధమయ్యారు. నవంబర్ 8వ తేదీన సంగెం నుంచి మూసీ పాదయాత్ర ప్రారంభమవుతుంది. యాత్ర ప్రారంభం కంటే ముందు యాదాద్రిలో ముఖ్యమంత్రిలో ప్రత్యేక పూజలు చేస్తారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. నవంబర్ 8వ తేదీన సంగెం నుంచి మూసీ నది వరకు పునరుజ్జీవన సంకల్ప యాత్ర ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఖరారైంది.

సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్:

  • రేపు (నవంబర్ 8) ఉదయం 9 గంటలకు బేగంపేట్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో యాదగిరిగుట్టకు బయలుదేరుతారు.
  • 10 గంటలకు లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
  • ఉదయం 11.30 కు యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ, ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్షిస్తారు.
  • మధ్యాహ్నం 1.30 కి రోడ్డు మార్గంలో సంగెం గ్రామానికి బయల్దేరుతారు.
  • సంగెం నుంచి మూసీ నది పునరుజ్జీవన సంకల్ప యాత్ర ప్రారంభమవుతుంది.
  • మూసీ నది కుడి ఒడ్డున భీమలింగం వరకు దాదాపు 2.5 కిలో మీటర్ల పాదయాత్ర కొనసాగుతుంది.
  • అక్కడి నుంచి తిరిగి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం - నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగుతోంది.
  • ఇక్కడే యాత్రను ఉద్దేశించి మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.
  • అనంతరం హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణమవుతారు.
  • సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

మూసీ నదిని ప్రక్షాళన దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా… ముందుకే సాగుతున్నారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా శుద్ధీకరణ, నదికి పునరుజ్జీవం కల్పించాల్సిన అత్యవసర పరిస్థితిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. అందులో భాగంగానే.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాత్రకు సిద్ధమయ్యారు.

నల్లగొండ జిల్లా ప్రజలు, మూసీ పరీవాహక ప్రాంత రైతాంగంలోకి విస్తృతంగా తీసుకువెళ్లే పనిలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఉంది. మూసీ ప్రక్షాళణ విషయంలో ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్న ప్రతిపక్షాల కుట్రలను ఎండగట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అదే సమయంలో మల్లన్నసార్ నుంచి యాదాద్రి, మేడ్చల్ జిల్లాలకు తాగునీరు అందించే ప్రాజెక్టును రూ.210 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనుండగా ఈ పనులకు సీఎం రేవంత్ రెడ్డి 8వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు.

మూసీ పునరుజ్జీవన సంకల్ప యాత్రలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి… మూసీ పరీవాహక ప్రాంత రైతులను కలుస్తూ, వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. మూసీ మురుగునీటి ప్రధాన బాధితులుగా ఉన్న ఉమ్మడి నల్గొండ రైతాంగం, ప్రజల మద్దతు కూడగట్టేందుకు సీఎం పర్యటనను ఉపయోగించుకోవాలని జిల్లా ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు సిద్ధం చేశారు.

తదుపరి వ్యాసం