తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth On Nalini Posting : మాజీ డీఎస్పీ నళిని ఉద్యోగంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా - డీజీపీ, సీఎస్ కు కీలక ఆదేశాలు

CM Revanth On Nalini Posting : మాజీ డీఎస్పీ నళిని ఉద్యోగంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా - డీజీపీ, సీఎస్ కు కీలక ఆదేశాలు

15 December 2023, 21:54 IST

google News
    • CM Revanth On Ex-DSP Nalini Posting : మాజీ డీఎస్పీ నళినికి ఉద్యోగంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆమెకు ఉద్యోగావకాశాలు చూడాలని.. యూనిఫామ్ సర్వీస్ లో కాకపోయినా నళినికి ఇష్టమైతే ఇతర శాఖలోనైనా ఉద్యోగం ఇవ్వాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నళిని తన ఉద్యోగానికి రాజీనామా చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు (Twitter)

సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth reddy On Ex-DSP Nalini Posting: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వటంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ఆరా తీశారు. నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి వుంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా వుంటే అదే హోదాలో వేరే శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.

డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, పోలీస్ శాఖలో నియామకాల మీద సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఎందుకు వర్తింపజేయకూడదని అధికారులను సీఎం ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలని అభిప్రాయపడ్డారు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళిని సుముఖంగా ఉంటే, వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళిని… ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. పరకాల ఉపఎన్నికల్లో కూడా పోటీ చేశారు.

తదుపరి వ్యాసం