CM Revanth Reddy : నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ని ఆపవద్దు - సీఎం రేవంత్ రెడ్డి-cm revanth reedy orders not to stop traffic for his convoy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ని ఆపవద్దు - సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ని ఆపవద్దు - సీఎం రేవంత్ రెడ్డి

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 15, 2023 08:27 PM IST

CM Revanth Reddy Latest News: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో నిర్ణయం తీసుకున్నారు. తన కోసం ట్రాఫిక్ ను ఆపవద్దని పోలీసులను ఆదేశించారు.

సీఎం రేవంత్  రెడ్డి కీలక నిర్ణయం
సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

Chief Minister Revanth Reddy: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. తాజాగా తన కాన్వాయ్ కి సంబంధించి కూడా కీలక ఆదేశాలిచ్చారు. తన కోసం ట్రాఫిక్‌ని ఆపవద్దంటూ పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా తన కాన్వాయ్‌ను తీసుకెళ్లాలని సూచించారు. సాధారణ ట్రాఫిక్‌లోనే తన కాన్వాయ్‌ని అనుమతించాలని స్పష్టం చేశారు. కాన్వాయ్ వాహనాల సంఖ్య 15 నుంచి 9కి తగ్గించాలని సూచించారు.

ధర్నాచౌక్‌లో ధర్నాలకు అనుమతి - హైదరాబాద్ సీపీ

ఇదిలా ఉంటే ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను యథావిధిగా కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నగర పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఇందులో భాగంగా ధర్నా చౌక్‌ను పరిశీలించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ధర్నా చౌక్‌లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని… ధర్నా చౌక్‌లో ఎవరైనా ఆందోళనలు చేపట్టవచ్చని అన్నారు. ధర్నాలు నడుస్తున్న సమయంలో రోడ్లను మూసివేసే ప్రసక్తే లేదని… ట్రాఫిక్‌కి ఇబ్బంది లేకుండా ధర్నాలు చేపట్టవచ్చని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంటుందని… కానీ శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూసుకోవాలని అన్నారు.

ఐఏఎస్‌ అధికారులకు పోస్టింగులు :

2021 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారులకు పోస్టింగులు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.

♦️హన్మకొండ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా రాధికా గుప్తా

♦️ములుగు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పి.శ్రీజ

♦️నిర్మల్‌ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా ఫైజాన్‌ అహ్మద్‌

♦️రాజన్న సిరిసిల్ల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పి. గౌతమి

♦️జనగాం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పి.పి. లలిత్‌కుమార్‌

♦️మహబూబాబాద్‌ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా లెనిన్‌ వత్సల్‌

♦️మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా శివేంద్ర ప్రతాప్

♦️వనపర్తి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా సంచిత్‌ గాంగ్వార్‌

♦️జయశంకర్‌ భూపాలపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పి.కదిరవన్‌

Whats_app_banner