Aksharabhyasam at Basara : బాసరలో ఆన్‌లైన్ అక్షరాభ్యాసాలు.. టికెట్ ధరలివే
08 December 2022, 10:35 IST
- Aksharabhyasam Ticket Prices: బాసరలోని శ్రీసరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆన్‌లైన్ అక్షరాభ్యాసాలపై కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు. ధరలు నిర్ణయిస్తూ ప్రకటన జారీ చేశారు.
బాసరలో ఆన్‌లైన్ అక్షరాభ్యాసాల ధరలివే
Aksharabhyasam Ticket Prices at Basara: బాసర(Basara)లోని సరస్వతీ దేవి ఆలయంలో అక్షరాభ్యాసం (Aksharabhyasam)కార్యక్రమాన్ని ఆన్‌లైన్(Online)లో చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు ధరలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వదేశంతో పాటు విదేశాలకు చెందిన వారికి వేర్వురు రేట్లు నిర్ణయించారు. ఇక ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం ద్వారా చదువుపై ఆసక్తి ఉంటుంది.. గొప్పగా చదవుతారనే భక్తులు నమ్ముతుంటారు.
ధరలు ఇలా...
స్వదేశంతో పాటు విదేశాల్లో ఉన్నవారు కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే వారికి పూజచేసిన వస్తువులను తపాలాశాఖ ద్వారా పంపించడానికి ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ మేరకు టికెట్ ధరలు నిర్ణయించారు. విదేశీయులకు రూ.2,516 ఉండగా.. స్వదేశం వారికి రూ.1,516గా ప్రకటించారు. భక్తులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్‌లో అక్షరాభ్యాసాలు, పూజలు ప్రారంభించాలని నిర్ణయించారు. వీటిని ఏవిధంగా చేయాలి తదితర అంశాలపై కసరత్తు జరుగుతోంది. నిర్ణయించిన ధరలకు సంబంధించిన అనుమతి కోసం కమిషనర్‌కు లేఖ రాశారు. అనుమతి రాగానే ఆన్‌లైన్లో అక్షరాభ్యాసాలు మొదలుకానున్నాయి.
దేశం నలుమూలల నుండి తల్లిదండ్రులు బాసర ఆలయానికి తరలివస్తారు. ప్రతి సంవత్సరం, నాలుగు లక్షల మంది యాత్రికులు ఆలయాన్ని సందర్శిస్తారు. 40,000 మంది బాసర ఆలయం(Basara Temple) ప్రాంగణంలో 'అక్షరాభ్యాసం' చేస్తారు. ఆన్ లైన్ విధానం అయితే ఎక్కువ మందికి సేవలు అందించే అవకాశం ఉంటుంది. ఇటీవల సికింద్రాబాద్‌లోని గణేష్ ఆలయం(Ganesh Temple)లో ఆన్‌లైన్ సేవలను ప్రవేశపెట్టారు. ఆలయ సేవల డిజిటలైజేషన్ మొదటి దశలో వచ్చిన అపూర్వ స్పందన మరిన్ని పుణ్యక్షేత్రాలకు విస్తరించే ఆలోచనలో దేవదాయశాఖ అధికారులను ఉన్నారు.
బాసర ఆలయం హైదరాబాద్(Hyderabad) నుంచి 205 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడకు నిత్యం మహారాష్ట్ర, నిజామాబాద్, నాందేడ్, ధర్మాబాద్ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల భక్తులు వస్తుంటారు. బాసరకు వెళ్లేందుకు రైలుమార్గం(Train Route) కూడా ఉంది. దేశంలోనే రెండో సరస్వతీ దేవి ఆలయం(Saraswati Temple)గా బాసర ఉంది. గోదావరి నది(Godavari River) ఒడ్డున చక్కటి వాతావరణంలో అమ్మవారు ఇక్కడ కొలువుదీరారు. నిత్యం పూజలందుకుంటారు. వేదవ్యాస మహర్షి తపస్సు చేస్తే జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించిందని పురాణాలు చెబుతున్నాయి.