తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay On Kcr : అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిందంతా అబద్ధమని నిరూపిస్తా

Bandi Sanjay On KCR : అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిందంతా అబద్ధమని నిరూపిస్తా

HT Telugu Desk HT Telugu

12 September 2022, 16:50 IST

    • BJP Praja Sangrama Yatra : కేంద్ర విద్యుత్ బిల్లులపై పవిత్రమైన అసెంబ్లీనే తప్పుదోవ పట్టిస్తావా? అని సీఎం కేసీఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ సమాజానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. తాను చెప్పేది తప్పయితే రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేశారు.
బండి సంజయ్
బండి సంజయ్

బండి సంజయ్

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టకపోతే కరెంట్ కట్ చేసేలా కేంద్రం విద్యుత్ బిల్లును రూపొందించిందంటూ కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభోత్సవ సభలో భాగంగా మాట్లాడారు. ఎక్కడివో పాత పేపర్లను, చిత్తు కాగితాలను పట్టుకుని పవిత్రమైన అసెంబ్లీని కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిందంతా అబద్ధమని నిరూపించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

Bhadradri District : ఎంత అమానుషం! పండగకు చందా ఇవ్వలేదని 19 కుటుంబాల గ్రామ బహిష్కరణ

Heavy Rain in Hyderabad : ఒక్కసారిగా మారిన వాతావరణం - హైదరాబాద్‌లో కుండపోత వర్షం

TS Court Jobs 2024 : తెలంగాణ హైకోర్టు నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ - భారీగా వేతనం, ముఖ్య తేదీలివే

Online Job Fraud: ఆన్​ లైన్​ జాబ్​ పేరుతో మోసం, 12 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు, వరంగల్‌లో పెరుగుతున్న సైబర్ మోసాలు

'కేసీఆర్ ఇదిగో కేంద్ర విద్యుత్ బిల్లు.. నీకు పంపిస్తున్నా. చదువుకో.. తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయ్. పవిత్రమైన అసెంబ్లీనే తప్పుదోవ పట్టించిన నువ్వు వెంటనే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే. ఒకవేళ నేను చెప్పేది తప్పయితే రాజీనామాకు సిద్ధం' బండి సంజయ్ సవాల్ విసిరారు. బీజేపీ పేరుతో మోటార్లకు మీటర్లు పెట్టేందుకు, కరెంట్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై మరో రూ.4 వేల కోట్ల భారం మోపేందుకు కేసీఆర్ కుట్రకు తెరదీశారని అన్నారు. బీజేపీ పేరుతో మోటార్లకు మీటర్లు పెడితే ప్రగతి భవన్ గడీలు బద్ధలు కొట్టి తీరుతామని హెచ్చరించారు.

ఆర్టీసీ విషయంలోనూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు బండి సంజయ్. 99 ఏళ్ల లీజు పేరుతో విలువైన ఆర్టీసీ డిపోలు, ఆర్టీసీ స్థలాలను కేసీఆర్ కుటుంబం, వారికి కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం చేయనీయబోమని చెప్పారు. కేసీఆర్ తాగడానికి అడ్డాగా మారిన ప్రగతి భవన్ ను కేసీఆర్ బార్ గా అభివర్ణించారు.

బండి సంజయ్ ఇంకా ఏం మాట్లాడారంటే..

కుత్బుల్లాపూర్ మినీ భారత్. అన్ని రాష్ట్రాల వాళ్లు కలిసి ఉండే ప్రాంతమిది. ముఖ్యమంత్రికి సోయి లేదు. అసోం సీఎం వస్తే భద్రత కల్పించలేని దుస్థితి. పాదయాత్రకు అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు పెట్టారు. అయినా పాదయాత్ర చేస్తున్నా.. తెలంగాణ తల్లి రోదిస్తోంది. సమస్యలు తెలుసుకోవాలని కోరుతోంది. బంధ విముక్తిరాలిని చేయాలని అడుగుతోంది.

జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం కార్మికుడి మొదలు కంపెనీల సీఈవోల వరకు ఉండే ప్రాంతమిది. ఇక్కడ కంపెనీల్లో వాటా కావాలని సీఎం కుటుంబం ఒత్తిడి తెస్తుంటే తట్టుకోలేక ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నయ్. హైదరాబాద్ ను ఏ విధంగా నాశనం చేసినవో ప్రజలకు చెప్పడానికే పాదయాత్ర చేస్తున్నా.

హైదరాబాద్ ను డల్లాస్, లండన్, సింగపూర్, న్యూయార్క్ చేస్తానన్నవ్... ఏమైంది? హైదరాబాద్ లో గుంత కన్పిస్తే వెయ్యి రూపాయలిస్తానంటివి.. నేను వస్తున్న దారంతా గుంతల మయమే. ఆ గుంతలకు డబ్బులియ్యాలంటే నీ బడ్జెట్ కూడా సరిపోనట్లుంది.

కేంద్ర నిధులతో ఫ్లైఓవర్, కేబుల్ బ్రిడ్జీలు కట్టి అదే అభివృద్ధి అంటున్నడు. డ్రైనేజీ సరిగా లేదు. చినుకు పడితే హైదరాబాద్ మునిగిపోయే దుస్థితి. నాలాల్లో పడి చనిపోతున్నారు. పట్టించుకోవడం లేదు. నాలాలు, చెరువులను టీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నరు. దీనిని ప్రశ్నించడానికే పాదయాత్ర చేస్తున్నా.

మూసీని ప్రక్షాళన చేస్తానన్నడు. కొబ్బరి నీళ్లలా మారుస్తానన్నడు. రూపాయి బిల్ల వేస్తే కనబడేలా హుస్సేన్ సాగర్ ను తీర్చిదిద్దుతానన్నడు. నీళ్లు కాలుష్యంతో ప్రజలు అల్లాడుతున్నరు. నీళ్లన్నీ విషమైనయ్. ఈ నీళ్లు పంపిస్తా.. తాగి చెప్పాలి కేసీఆర్. ఇవన్నీ అడుగుతుంటే బీజేపీది మతతత్వ పార్టీ అంటున్నడు. 80 వేల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నిస్తే మతతత్వమా?

యూనివర్శిటీల్లో డ్యాన్సులు వేయకపోతే డిస్ క్వాలిఫై చేస్తానని చెప్పి వీసీ తప్పతాగి చిందులేసిండు. మీడియా ప్రశ్నిస్తే పైసలిచ్చి పోస్టింగ్ తెచ్చుకున్నాడని చెప్పిండు. ప్రభుత్వ హాస్టళ్లలో, గురుకులాల్లో పురుగులలు, బొద్దింకలు, బల్లులు పడ్డ అన్నం తినలేక ఆసుపత్రుల పాలైతున్నరు విద్యార్థులు. కుటుంబ నియంత్రణ పేరుతో పేద మహిళలకు ఎలాంటి పరీక్షలు చేయకుండానే గంటలో 34 మందికి ఆపరేషన్ చేస్తే నలుగురు చనిపోయిండ్రు. 30 మంది ఆసుపత్రి పాలైండ్రు. దీనికి కారణమైన హెల్త్ డైరెక్టర్ ను వెనుకేసుకొస్తున్నరు.

తదుపరి వ్యాసం