Bandi Sanjay : బండి సంజయ్‌కు తలనొప్పిగా కన్వీనర్ల వ్యవహారం….
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు నియోజక వర్గ కన్వీనర్ల నియామక వ్యవహారం తలనొప్పిగా మారింది. ముందే కన్వీనర్లను ప్రకటిస్తే వారు తామే అభ్యర్ధులుగా ప్రచారం చేసుకునే ప్రమాదం ఉండటం వేచి చూసే ధోరణి అవలంబించాలని బండి సంజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల కోసం క్షేత్ర స్థాయిలో పార్టీ నేతల్ని బీజేపీ నాయకత్వం సన్నద్ధం చేస్తోంది. Bandi Sanjayపార్టీ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. పార్లమెంటు కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, క్షేత్ర స్థాయి బాధ్యులతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల భేటీ అయ్యారు. బీజేపీ కన్వీనర్లు, సంస్థాగత బాధ్యులు చేయాల్సిన పనులపై సమావేశంలో చర్చించారు. బూత్ కమిటీల నియామకం, పార్లమెంటు ప్రవాస యోజన వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
సెప్టెంబర్ 25లోపు బూత్ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని Bandi Sanjayబండి సంజయ్ నేతలకు ఆదేశించారు.పార్లమెంట్ ప్రవాస యోజక కార్యక్రమాన్ని సమన్వయం చేసుకునే బాధ్యత స్థానిక కన్వీనర్లకు అప్పగించారు. అయితే పార్టీలో నియోజకవర్గ కన్వీనర్ల నియామకం ఎప్పుడు చేపడతారనే విషయంలో మాత్రం నేతల ప్రశ్నలకు బండి సంజయ్ నేరుగా సమాధానం ఇవ్వలేకపోయారని చెబుతున్నారు.
కీలకమైన నియోజక వర్గ బాధ్యతలు నాయకులకు అప్పగించే విషయంలో పార్టీ అగ్రనాయకత్వం ఎందుకు తటపటాయిస్తుందనే విషయం నేతలకు అర్థం కాక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ప్రశ్నిస్తున్నా వారు ఆశించిన సమాధానం మాత్రం దక్కడం లేదు. అసెంబ్లీ కన్వీనర్లను నియమించాలని పార్టీ నేతలు అభ్యర్ధనను త్వరలోనే చేపడతామనిBandi Sanjayబండి సంజయ్ మాట దాట వేయడంతో నేతల్లో టెన్షన్ నెలకొంది.
జిల్లా కోర్ కమిటీలు ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గం నుంచి మూడు నాలుగు పేర్లను ప్రతిపాదించడం వారిలో ఎవరిని కన్వీనర్‌గా ఎంపిక చేసినా పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయనే ఉద్దేశంలో Bandi Sanjay బండి సంజయ్ ఉన్నారని చెబుతున్నారు. కన్వీనర్ల ఎంపిక తేనె తుట్టెను కదిపితే తనను బద్నాం చేస్తారనే భయంతోనే వారి పేర్లను ప్రకటించ లేకపోతున్నట్లు చెబుతున్నారు. కన్వీనర్ల ఎంపిక కోసం నియోజక వర్గాల నుంచి ఒక్క పేరును మాత్రమే కోర్ కమిటీ సిఫార్సు చేయాలని సూచించి బండి సంజయ్ బయటపడినట్లు తెలుస్తోంది.
కన్వీనర్‌గా ఎవరిని ఎంపిక చేసినా వారు తమనే ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రచారం చేసుకునే ప్రమాదం ఉండటంతో బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. దీని వల్ల ఎన్నికల నాటికి ఇబ్బంది కరమైన పరిస్థితులు ఎదురవుతాయని ఆందోళన చెందుతున్నారు. కన్వీనర్లను ముందే ప్రకటిస్తే పార్టీలో చేరడానికి ఆసక్తి చూపే బలమైన నాయకులు దూరమవుతారనే భయం కూడా బీజేపీలో ఉంది. అందుకే ఎవరిని కన్వీనర్ చేయాలనే విషయంలో కిందా మీద పడుతున్నారు.
గత ఎన్నికల్లో బీజేపీలో పోటీ చేసి ఓడిపోయిన వారు, టిక్కెట్లను ఆశిస్తున్న వారు తామే అభ్యర్ధులుగా నియోజక వర్గాల్లో హడావుడి చేసుకుంటుడటంతో వాటికి అడ్డుకట్ట వేయాలని ఇతర నేతలు ఫిర్యాదులు చేస్తుండటం బండి సంజయ్‌కు తలనొప్పిగా మారింది. కన్వీనర్‌ల నియామకాన్ని కొంత కాలం పాాటు వాయిదా వేయడం ద్వారా సమస్య నుంచి బయటపడాలని భావిస్తున్నట్లు సమాచారం.
టాపిక్