తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Acb Raids : కాసుల కోసం కక్కుర్తి- ఏసీబీ చిక్కిన ఎస్సై, ఆర్టీసీ డిపో మేనేజర్

ACB Raids : కాసుల కోసం కక్కుర్తి- ఏసీబీ చిక్కిన ఎస్సై, ఆర్టీసీ డిపో మేనేజర్

HT Telugu Desk HT Telugu

15 April 2024, 19:07 IST

google News
    • ACB Raids : ఓ యాక్సిడెంట్ కేసులో మహిళా ఎస్సై, ఛార్జ్ మెమో ఘటనలో ఆర్టీసీ డిపో మేనేజర్...లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
ఏసీబీకి చిక్కిన అధికారులు
ఏసీబీకి చిక్కిన అధికారులు

ఏసీబీకి చిక్కిన అధికారులు

ACB Raids : ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటూ వారి విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత మరచి, లంచాల కోసం కొందరు ఉద్యోగులు కక్కుర్తి పడుతున్నారు. అలాంటి ఇద్దరు అధికారులు సోమవారం ఏసీబీ వలకు చిక్కారు.

మహిళా ఎస్సై అరెస్ట్

ఉమ్మడి ఆదిలాబాద్ లోని కొమురం భీం ఆసిఫాబాద్(Asifabad) జిల్లా కేంద్రంలో ఓ యాక్సిడెంట్ కేసు(Accident Case)లో రూ.40,000 డిమాండ్ చేసి రూ.25 వేలు తీసుకుంటుండగా మహిళ ఎస్సై ఏసీబీ(ACB Arrested SI) చిక్కారు. ఎస్సై రాజ్యలక్ష్మి తన పరిధిలోకి వచ్చిన ఒక కేసు విషయంలో రూ.40 వేల లంచం డిమాండ్ చేశారు. గత నెల 31న బూరుగువాడ సమీపంలో కారు, ద్విచక్ర వాహనం ఢీ కొట్టుకున్నాయి. ఈ సంఘటనలో మంచిర్యాల జిల్లా నస్పూర్ కు చెందిన యాహిన్ ఖాన్ అనే నిందితుడికి స్టేషన్ బెయిల్, వాహనం తిరిగి ఇవ్వడానికి ఎస్సై రాజ్యలక్ష్మి రూ.40 వేలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రూ.25 వేలకు ఒప్పుకున్నారన్నారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. సోమవారం మూడున్నర గంటల సమయంలో మహిళా ఎస్సై రాజ్యలక్ష్మికి రూ. 25 వేలు అందిస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు ఆమె తీసుకున్న నగదును సీజ్ చేసి, ఎస్ఐను అరెస్టు చేసి కరీంనగర్ కు తరలించారు.

ఏసీబీకి చిక్కిన హుజురాబాద్ డిపో మేనేజర్

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ టీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీకాంత్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. డ్రైవర్ తాటికొండ రవీందర్ నుంచి రూ.20 వేలు ఎల్కతుర్తిలో ఓ హోటల్ లో తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదు సీజ్ చేసి శ్రీకాంత్ ను అరెస్టు చేశారు. మంగళవారం వరంగల్ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

ఛార్జ్ మెమో రద్దుకు రూ.30 వేలు డిమాండ్

హుజురాబాద్ డిపోలో(Huzurabad Depot Manager ) డ్రైవర్ గా పనిచేస్తున్న ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన రవీందర్ ఫిబ్రవరిలో బందువు చనిపోతే విధులు హాజరు కాకపోవడంతో డిపో మేనేజర్ శ్రీకాంత్ ఛార్జ్ మెమో(Charge Memo) జారీచేశారు. ఆ ఛార్జ్ మెమో తొలగించడం కోసం డిపో మేనేజర్ రూ.30 వేలు డిమాండ్ చేశాడు. ఇది వరకే రూ.10 వేలు ముట్టజెప్పాడు. మిగతా రూ.20 వేల కోసం ఇబ్బంది పెట్టడంతో డ్రైవర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.‌ రూ. 20 వేలు ఎల్కతుర్తిలో ఓ హోటల్ వద్ద డ్రైవర్ నుంచి డిపో మెనేజర్ శ్రీకాంత్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ(ACB) అధికారులు పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని, డిపో మేనేజర్ ను అరెస్టు చేశారు.

డిపోలో తనిఖీలు, రికార్డులు స్వాధీనం

రూ.20 వేలు లంచం తీసుకుంటూ డిపో మేనేజర్(Depot Manager) శ్రీకాంత్ ఏసీబీకి చిక్కడంతో అధికారులు పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. హుజురాబాద్ డిపోలో, శ్రీకాంత్ ఇంట్లో సోదాలు(ACB Checking) నిర్వహించి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాంత్ ఇటీవలే హుజురాబాద్ డిపో మేనేజర్ గా బదిలీపై వచ్చారు. ఇది వరకు ఆయన పని చేసిన చోటా, అతని ట్రాక్ రికార్డు వెలికి తీశారు ఏసీబీ అధికారులు. ఆర్టీసీలో లంచం తీసుకుంటూ డిపో మేనేజర్ ఏసీబీకి చిక్కడం ఫస్ట్ టైం కావడంతో టీఎస్ ఆర్టీసీలో(TSRTC) కలకలం రేగింది. డిపో మేనేజర్ ను సస్పెండ్ చేసే పనిలో ఆర్టీసీ యాజమాన్యం నిమగ్నమైంది.

రిపోర్టింగ్: వేణుగోపాల కామోజీ, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా

HT Correspondent K.V.REDDY, karimnagar

తదుపరి వ్యాసం