తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  National Flag At Bhadrakali Bund: ఓరుగల్లు సిగలో మరో వన్నె..150 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ

National Flag At Bhadrakali Bund: ఓరుగల్లు సిగలో మరో వన్నె..150 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ

HT Telugu Desk HT Telugu

27 January 2023, 8:19 IST

    • 150 Feet National Flag in Warangal: ఓరుగల్లు సిగలో మరో హుంగు చేరిం ది. పర్యాటక ప్రాంతమైన భద్రకాళి బండ్‌పై 150 అడుగుల ఎత్తుగల జాతీయ జెండా కొలవుదీరింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఈ భారీ జెండాను ఆవిష్కరించారు.
భద్రకాళి బండ్ ఒడ్డున మువ్వెన్నల జెండా
భద్రకాళి బండ్ ఒడ్డున మువ్వెన్నల జెండా (twitter)

భద్రకాళి బండ్ ఒడ్డున మువ్వెన్నల జెండా

150 Feet National Flag At Bhadrakali Bund: ఓరుగల్లు నగరంలో భారీ మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. భద్రకాళి బండ్ పై జీడబ్ల్యూ ఎంసీ(greater warangal municipal corporation) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 150 అడుగుల జాతీయ జెండాను గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, కమిషనర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ సుందర్ రాజ్ లు పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Koheda Gutta ORR : ఓఆర్ఆర్ పక్కనే ఉన్న కోహెడ గుట్టను చూసొద్దామా..! వ్యూపాయింట్ అస్సలు మిస్ కావొద్దు

Rohith Vemula Case : రోహిత్ వేముల దళితుడు కాదు..! హైకోర్టులో కేసు క్లోజ్ రిపోర్ట్ దాఖలు

Guinness World Record : కేవలం 2.88 సెకన్లలోనే 'Z నుంచి A' వరకు టైపింగ్ - గిన్నిస్‌ రికార్డు సాధించిన హైదరాబాదీ

Leopard in Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

రూ. 25 లక్షల వ్యయం..

జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో రూ.25 లక్షలతో భద్రకాళి బండ్‌పై ఈ జెండాను ఏర్పాటు చేశారు. 150 అడుగుల స్తంభానికి 48/32 సైజుతో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు. ఈ భారీ జెండాను రిపబ్లిక్‌ డే సందర్భంగా ఎలక్ర్టిక్‌ మోటార్‌ ద్వారా పతాకాన్ని పైకి చేర్చి ఆవిష్కంచారు. జెండా పైకి వెళ్లడానికి పది నిమిషాల సమయం పడుతుంది. మోటార్‌ స్విచ్‌ ఆన్‌ చేయగానే జాతీయజెండా 150 ఎత్తులోకి వెళ్లడం జరుగుతుంది.

ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ… ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం మన దేశంలోనే అమలవుతుందన్నారు. పోరాడి సాధించిన తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవుతోందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు.దాస్యం మాట్లాడుతూ.. అంబేదర్‌ ఆలోచన మేరకు సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. పేదల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం… దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా అడుగులు పడుతున్నాయని.. ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు.

ఇక 2016లో హుస్సేన్ సాగర్ తీరాన దేశంలోకెల్లా అతిపెద్ద జాతీయ జెండాను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 291 అడుగుల జెండాను సంజీవయ్య పార్కు లో ఏర్పాటు చేశారు. నగరంలోని అతి సువిశాలమైన ప్రదేశంలో ఈ జాతీయ జెండాను ఏర్పాటు చేయటంతో యావత్ జాతిలో దేశభక్తిని పెంపొందించటమే లక్ష్యంగా ఏర్పాటు చేశారు. ఈ అతిపెద్ద జాతీయ జెండా ఎన్నో రికార్డులను కూడా సొంతం చేసుకుంది.