Indian Racing League in Hyd: హుస్సేన్‌ సాగర్‌ తీరంలో రయ్.. రయ్…-formula e racing started in hyderabad city ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Indian Racing League In Hyd: హుస్సేన్‌ సాగర్‌ తీరంలో రయ్.. రయ్…

Indian Racing League in Hyd: హుస్సేన్‌ సాగర్‌ తీరంలో రయ్.. రయ్…

Nov 19, 2022, 07:33 PM IST HT Telugu Desk
Nov 19, 2022, 07:33 PM , IST

  • Formula E Race in Hyderabad: హుస్సేన్‌ సాగర్‌ తీరంలో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ ట్రయల్ రన్ ప్రారంభమైంది. స్ట్రీట్‌ సర్క్యూట్‌పై స్పోర్ట్స్‌ కార్లు రయ్‌.. రయ్‌ మంటూ పరుగులు తీశాయి. 3.10 గంటల నుంచి 3.20 గంటల వరకు క్వాలిఫయింగ్-1 డ్రైవర్ ఏ బృందం, 3.30 నుంచి 3.40 నిమిషాల వరకు క్వాలిఫయింగ్‌-2 బి బృందం రేస్‌ ప్రారంభించింది. సాయంత్రం 4 గంటల నుంచి 4.45 గంటల వరకు మెయిన్‌ రేస్‌ జరిగింది.  ఈ రేసింగ్ లను చూసేందుకు పలువురు ప్రముఖులతో పాటు నగర వాసులు భారీగా హాజరయ్యారు. రేస్‌ కార్లు చూసి.. వాటితో ఫొటోలు దిగేందుకు యువత పోటీ పడుతున్నారు. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న అసలైన  ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ పోటీలు జరుగుతాయి.

హైదరాబాద్ లోని హుస్సేన్‌ సాగర్‌ తీరంలో శనివారం ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ ప్రారంభమైంది. స్ట్రీట్‌ సర్క్యూట్‌పై  కార్లు రయ్‌.. రయ్‌ మంటూ  దూసుకెళ్లాయి.

(1 / 4)

హైదరాబాద్ లోని హుస్సేన్‌ సాగర్‌ తీరంలో శనివారం ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ ప్రారంభమైంది. స్ట్రీట్‌ సర్క్యూట్‌పై  కార్లు రయ్‌.. రయ్‌ మంటూ  దూసుకెళ్లాయి.(twitter)

ఈ లీగ్ ను రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు.హుస్సేన్‌సాగర్ నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన 2.7 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్‌లో గంటకు 300 కిలోమీటర్ల వేగంతో కార్లు దూసుకెళ్లాయి.

(2 / 4)

ఈ లీగ్ ను రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు.హుస్సేన్‌సాగర్ నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన 2.7 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్‌లో గంటకు 300 కిలోమీటర్ల వేగంతో కార్లు దూసుకెళ్లాయి.(twitter)

2023 ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ ప్రిపరేషన్‌లో భాగంగా శనివారం, ఆదివారం  ఇండియన్‌ రేసింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇవాళ పెట్రోల్‌ కార్లతోనే రేస్‌ నిర్వహించారు. 

(3 / 4)

2023 ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ ప్రిపరేషన్‌లో భాగంగా శనివారం, ఆదివారం  ఇండియన్‌ రేసింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇవాళ పెట్రోల్‌ కార్లతోనే రేస్‌ నిర్వహించారు. (twitter)

రేసింగ్‌ను వీక్షించడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ప్రేక్షకుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.మంత్రి కేటీఆర్‌ ఐమాక్స్‌ వద్ద ప్రేక్షకులతో పాటు నిల్చుని రేసింగ్‌ను వీక్షించారు. ఆయన కుమారుడు హిమాన్ష్ కూడా ఈ పొటీలను చూశారు.

(4 / 4)

రేసింగ్‌ను వీక్షించడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ప్రేక్షకుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.మంత్రి కేటీఆర్‌ ఐమాక్స్‌ వద్ద ప్రేక్షకులతో పాటు నిల్చుని రేసింగ్‌ను వీక్షించారు. ఆయన కుమారుడు హిమాన్ష్ కూడా ఈ పొటీలను చూశారు.(twitter)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు