తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wpl Auction: స్మృతి మంధానాపై కాసుల వర్షం.. బెంగళూరుకు ఆడనున్న ప్లేయర్

WPL Auction: స్మృతి మంధానాపై కాసుల వర్షం.. బెంగళూరుకు ఆడనున్న ప్లేయర్

Hari Prasad S HT Telugu

13 February 2023, 15:45 IST

    • WPL Auction: స్మృతి మంధానాపై కాసుల వర్షం కురిసింది. ఈ ఇండియన్ టీమ్ వైస్ కెప్టెన్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) వేలంలో భారీ ధర పలికింది. ఆమె బెంగళూరు టీమ్ కు ఆడనుంది.
స్మృతి మంధానా, హర్మన్‌ప్రీత్ కౌర్
స్మృతి మంధానా, హర్మన్‌ప్రీత్ కౌర్ (AFP)

స్మృతి మంధానా, హర్మన్‌ప్రీత్ కౌర్

WPL Auction: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) వేలం సోమవారం (ఫిబ్రవరి 13) ముంబైలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ స్మృతి మంధానా చరిత్ర సృష్టించింది. ఈ వేలంలో ఆమె ఏకంగా రూ.3.4 కోట్ల ధరకు అమ్ముడు పోవడం విశేషం. వేలంలో ఇదే అత్యధిక మొత్తం. ఆమెను బెంగళూరు ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

మరోవైపు ఇండియన్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రూ.1.8 కోట్లకు అమ్ముపోయింది. ఆమెను ముంబై ఇండియన్స్ టీమ్ కొనుగోలు చేసింది. హర్మన్ కోసం ముంబైతోపాటు ఢిల్లీ, బెంగళూరు పోటీ పడ్డాయి. స్మృతి మంధానాను కొనుగోలు చేసిన తర్వాత కూడా బెంగళూరు టీమ్ హర్మన్ కోసం తీవ్రంగా ప్రయత్నించడం విశేషం. ఇండియన్ మెన్స్ టీమ్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కూడా ముంబై ఇండియన్స్ దగ్గరే ఉన్న విషయం తెలిసిందే.

ఇక స్మృతి మంధానాను కొనుగోలు చేసిన బెంగళూరు కెప్టెన్సీని ఆమెకే అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఆ టీమ్ స్మృతి మంధానాతోపాటు ఎలిస్ పెర్రీని కూడా కొనుగోలు చేసింది. ఆమెను కూడా కెప్టెన్సీ వరించే అవకాశాలు ఉన్నాయి. ఆమెను రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసింది. బెంగళూరు టీమ్ తమ గరిష్ఠ పరిమితిలో సగం మొత్తాన్ని కేవలం ముగ్గురు ప్లేయర్స్ పైనే ఖర్చు చేయడం విశేషం.

ఆస్ట్రేలియా ప్లేయర్ ఆష్లీ గార్డ్‌నర్ ను రూ.3.2 కోట్లకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది. రూ.50 లక్షల బేస్ ప్రైస్ తో ఉన్న ఆమె కోసం ముంబై టీమ్ కూడా గట్టిగానే పోటీ పడింది. అటు మహిళల నంబర్ వన్ టీ20 బౌలర్, ఇంగ్లండ్ కు చెందిన సోఫీ ఎకిల్‌స్టోన్ ను యూపీ వారియర్స్ టీమ్ రూ.1.8 కోట్లకు సొంతం చేసుకుంది. వేలంలో అమ్ముడైన తొలి ఇంగ్లండ్ ప్లేయర్ సోఫీనే.

తదుపరి వ్యాసం