WPL Auction: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో స్మృతీకే అత్యధిక ధర.. ఆకాశ్ చోప్రా స్పష్టం
WPL Auction: వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో స్మృతీ మంధానానే అత్యధిక పలుకుతుందని భారత ఆటగాడు ఆకాశ్ చోప్రా స్పష్టం చేశారు. ఈ వేలంలో భారత క్రికెటర్లకే ఎక్కువ మొగ్గు చూపుతారని జోస్యం చెప్పారు.
WPL Auction: ఐపీఎల్ తరహాలో మహిళా క్రికెటర్ల కోసం వుమెన్ ప్రీమియర్ లీగ్(Women Premeire League) ఆరంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం వేలాన్ని(WPL Auction) కూడా నిర్వహిస్తోంది. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఈ వేలం ప్రారంభమవుతుంది. ఈ ఆరంభ సీజన్‌లో ఎవరు ఎక్కువ ధర పలుకుతారనే విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అంశంపై భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా స్పందించారు. మహిళల జట్టులో స్టార్ ప్లేయరైన స్మృతి మంధానాను వేలంలో ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తారని స్పష్టం చేశారు.
"ఈ వేలం అత్యంత ఆసక్తిగా మారనుంది. ఎందుకంటే ఇదే మొదటి సారి కాబోతుందని అందరి దృష్టి దీనిపైనే ఉంది. క్రికెటర్లతో పాటు కెప్టెన్లను కూడా ఈ వేలంలోనే కనుగొనాలి. ఫ్రాంఛైజీలు కెప్టెన్‌ను తీసుకోవాలనుకుంటున్నప్పుడు ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి భారత క్రికెటర్లే అధిక ధర పలుకుతారనడంలో ఎలాంటి సందేహం లేదు." అని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశారు.
అందరి కంటే ఎక్కువ ధరకు స్మృతి మంధానాకు పలుకుతుందని ఆకాశ్ చోప్రా అన్నారు. "నా అభిప్రాయం ప్రకారం స్మృతి మంధానా అందరికంటే అధిక ధర పలికే అవకాశముంది. ఆ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ ఉంటారనుకుంటున్నా. ఎలిస్ పెర్రీ ఓ జట్టుకు కెప్టెన్‌గా ఉండే అవకాశముంది. ఐదో స్థానంలో ఆష్లే గార్డెనర్ ఉంటుంది. వీరు కాకుండా మెగ్ లానింగ్, న్యాట్ స్కైవర్, అమిలియా కెర్, హ్యాలీ మ్యాథ్యూస్, మారిజన్నే కేప్ లాంటి నాణ్యమైన క్రికెటర్లు ఎక్కువ ధర పలికే అవకాశముంది." అని ఆకాశ్ చోప్రా తెలిపారు.
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో మొత్తం 409 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు. ఇందులో 246 మంది భారతీయులు కాగా.. 163 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. మొత్తం 90 స్థానాల కోసం ఈ వేలం జరుగుతోంది. 5 జట్లలో మొత్తం 30 విదేశీ ప్లేయర్ల కోసం స్థానాలున్నాయి. 24 క్రికెటర్లకు తమ బేస్ ప్రైస్‌ను 50 లక్షల కంటే ఎక్కువగా నమోదు చేశారు. ఇందులో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, స్మృతీ తదితరులు ఉన్నారు.
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆరంభ సీజన్ మార్చి 3 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 26వరకు ఈ టోర్నీ జరగనుంది. ముంబయి డీవై పాటిల్ స్టేడంయ, బ్రబౌర్న్ స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ అనే ఐదు జట్లు ఈ టోర్నీలో ఆడుతున్నాయి. ఒక్కో జట్టు వద్ద 12 కోట్ల పర్సు ఉంది.