తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Women's Ipl Media Rights: వుమెన్స్‌ ఐపీఎల్‌కు ఫుల్‌ డిమాండ్‌.. రూ.951 కోట్లకు మీడియా హక్కులు

Women's IPL Media Rights: వుమెన్స్‌ ఐపీఎల్‌కు ఫుల్‌ డిమాండ్‌.. రూ.951 కోట్లకు మీడియా హక్కులు

Hari Prasad S HT Telugu

16 January 2023, 13:04 IST

google News
    • Women's IPL Media Rights: వుమెన్స్‌ ఐపీఎల్‌కు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. తొలిసారి జరగనున్న ఈ లీగ్‌ మీడియా హక్కులు ఏకంగా రూ.951 కోట్లకు అమ్ముడవడం విశేషం.
మహిళల ఐపీఎల్ మీడియా హక్కులకు భారీ మొత్తం
మహిళల ఐపీఎల్ మీడియా హక్కులకు భారీ మొత్తం

మహిళల ఐపీఎల్ మీడియా హక్కులకు భారీ మొత్తం

Women's IPL Media Rights: ఇండియన్‌ క్రికెట్‌లో ఐపీఎల్‌ ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. గత 15 ఏళ్లలో ఈ మెగాలీగ్‌ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు మహిళల క్రికెట్‌లోనూ అలాంటి అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. తొలిసారి వుమెన్స్‌ ఐపీఎల్‌ ఈ ఏడాది జరగనున్న విషయం తెలిసిందే.

ఈ లీగ్‌ కోసం మీడియా హక్కులను వేలం వేయగా.. రూ.951 కోట్లు వచ్చినట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా సోమవారం (జనవరి 16) వెల్లడించారు. వయాకామ్ 18 ఈ హక్కులను సొంతం చేసుకుంది. వచ్చే ఐదేళ్ల (2023-27) కాలానికిగాను ఈ హక్కులను వేలం వేశారు. ఒక్కో మ్యాచ్‌కు రూ.7.09 కోట్లు చెల్లించనుంది వయాకామ్‌ 18.

"వుమెన్స్‌ ఐపీఎల్‌ మీడియా హక్కులు సొంతం చేసుకున్న వయాకామ్‌ 18కు శుభాకాంక్షలు. బీసీసీఐ, బీసీసీఐ వుమెన్‌ బోర్డులపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు. వచ్చే ఐదేళ్లకుగాను వయాకామ్‌ రూ.951 కోట్లు చెల్లించనుంది. అంటే ఒక్కో మ్యాచ్‌కు రూ.7.09 కోట్లు. వుమెన్స్‌ క్రికెట్‌కు ఇది చాలా పెద్ద మొత్తం" అని జై షా ట్వీట్‌ చేశారు.

"పురుషులతో సమానంగా జీతాల నిర్ణయం తర్వాత ఇప్పుడు వుమెన్స్‌ ఐపీఎల్‌కు మీడియా హక్కుల రూపంలో వచ్చిన మొత్తం చారిత్రకం. ఇండియాలో మహిళల క్రికెట్‌ సాధికారత దిశగా ఇది అతిపెద్ద, నిర్ణయాత్మ అడుగు. ఇదో కొత్త ఉదయం" అని షా అన్నారు.

తొలి వుమెన్స్‌ ఐపీఎల్‌ ఈ ఏడాది మార్చిలో జరగనుంది. ఇందులో ఐదు టీమ్స్‌ పాల్గొననున్నాయి. ఈ టీమ్స్‌ను సొంతం చేసుకోవడానికి జనవరి 3న బీసీసీఐ టెండర్లు ఆహ్వానించింది. జనవరి 25న ఈ ఐదు టీమ్స్‌ను బోర్డు పరిచయం చేయనుంది. ప్రస్తుతం పురుషుల ఐపీఎల్‌లోని పది ఫ్రాంఛైజీల్లో ఎనిమిది ఫ్రాంఛైజీలు.. వుమెన్స్‌ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల కోసం పోటీ పడనున్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం