తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wimbledon: ఫెదరర్ రికార్డు సమం చేసిన జోకొవిచ్.. తానే ఫేవరెట్ అంటున్న సెర్బియన్ సెన్సేషన్

Wimbledon: ఫెదరర్ రికార్డు సమం చేసిన జోకొవిచ్.. తానే ఫేవరెట్ అంటున్న సెర్బియన్ సెన్సేషన్

Hari Prasad S HT Telugu

12 July 2023, 9:00 IST

google News
    • Wimbledon: ఫెదరర్ రికార్డు సమం చేశాడు నొవాక్ జోకొవిచ్. అంతేకాదు వింబుల్డన్ లో తానే ఫేవరెట్ అంటున్నాడు ఈ సెర్బియన్ సెన్సేషన్. తాజాగా అతడు సెమీఫైనల్ చేరాడు.
నొవాక్ జోకొవిచ్
నొవాక్ జోకొవిచ్ (AFP)

నొవాక్ జోకొవిచ్

Wimbledon: వింబుల్డన్ లో సెర్బియన్ సెన్సేషన్ నొవాక్ జోకొవిచ్ విజయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా అతడు సెమీఫైనల్ చేరాడు. పురుషుల గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 46వసారి జోకొవిచ్ సెమీస్ చేరడం విశేషం. ఈ క్రమంలో అతడు స్విస్ మాస్టర్ రోజర్ ఫెదరర్ రికార్డును సమం చేశాడు. అంతేకాదు ఈసారి వింబుల్డన్ తానే గెలుస్తాననీ స్పష్టం చేశాడు.

క్వార్టర్ ఫైనల్లో ఆండ్రీ రుబ్లెవ్ ను 4-6, 6-1, 6-4, 6-3తో ఓడించిన జోకొవిచ్ కు వింబుల్డన్ ఇది వరుసగా 33వ విజయం కావడం విశేషం. ఇప్పటికే వరుసగా నాలుగు వింబుల్డన్ టైటిల్స్ గెలిచిన నొవాక్.. మరో టైటిల్ కు చేరవవుతున్నాడు. ప్రస్తుతం జోకొవిచ్ ఖాతాలో ఏడు వింబుల్డన్ టైటిల్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా గెలిస్తే 8వ టైటిల్ తో ఫెదరర్ సరసన నిలుస్తాడు.

ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ తో పురుషుల కేటగిరీలో అత్యధిక టైటిల్స్ సాధించిన ప్లేయర్ గా జోకొవిచ్ నిలిచాడు. ఈ మధ్యే అతడు ఫ్రెండ్ ఓపెన్ కూడా గెలిచిన విషయం తెలిసిందే. ఆ టైటిల్ తో అతడు రఫేల్ నదాల్ ను వెనక్కి నెట్టాడు. ఫెదరర్ ఖాతాలో మొత్తం 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఇప్పుడు వింబుల్డన్ గెలిస్తే జోకొవిచ్ 24వ టైటిల్ తో మరింత ముందుకు దూసుకెళ్తాడు.

వింబుల్డన్ లో ఇప్పటి వరకూ తనకున్న రికార్డు చూస్తే.. ఈసారి కూడా తానే టైటిల్ గెలుస్తానని క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ తర్వాత జోకొవిచ్ అన్నాడు. శుక్రవారం అతడు సిన్నర్ తో సెమీఫైనల్లో తలపడనున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన జోకొవిచ్.. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ కూడా గెలిచి 1969లోరాడ్ లేవర్ తర్వాత తొలి కేలండర్ ఇయర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు.

తదుపరి వ్యాసం