French Open 2023 : జొకోవిచ్‌దే ఫ్రెంచ్ ఓపెన్.. టెన్నిస్ చరిత్రలో ఒక్క మగాడు
French Open 2023 : ఫ్రెంచ్ ఓపెన్ 2023 ఫైనల్‌లో నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌ను ఓడించి జొకోవిచ్ రికార్డు స్థాయిలో 23వ సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు.
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్(novak Djokovic) చరిత్రాత్మక విజయం సాధించాడు. సెర్బియా లెజెండ్ ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్ గెలిచిన తర్వాత 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న మొదటి పురుష టెన్నిస్ ప్లేయర్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో క్యాస్పర్ రూడ్‌తో జరిగిన ఫైనల్లో జొకోవిచ్ విజయం సాధించి ఈ చరిత్రాత్మక ఫీట్ సాధించాడు.
జకోవిచ్ తన ప్రత్యర్థి క్యాస్పర్ రూడ్‌ను వరుస సెట్లలో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో నొవాక్ జొకోవిచ్ టెన్నిస్ ప్రపంచంలోనే గొప్ప ఘనత సాధించాడు. ఫైనల్లో కాస్పర్ రూడ్‌తో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ విజయం సాధించాడు. జకోవిచ్ 7-6 (1), 6-3, 7-5 వరుస సెట్లలో విజయం సాధించి ఈ ఘనత సాధించాడు.
గతేడాది రోలాండ్ గారోస్‌లో 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్న రఫెల్ నాదల్‌ను జకోవిచ్ అధిగమించాడు. గాయం కారణంగా ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ నుంచి రఫెల్ నాదల్ వైదొలిగాడు. ఈ విజయంతో జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడోసారి గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించాడు.
రికార్డు స్థాయిలో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా నొవాక్ జకోవిచ్ గ్రాండ్‌స్లామ్‌ల సంఖ్యలో లెజెండ్ రోజర్ ఫెదరర్, స్పెయిన్ స్టార్ రఫెల్ నాదల్‌లను అధిగమించాడు. టెన్నిస్ చరిత్రలో పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ఆటగాడిగా నోవాక్ జకోవిచ్ రికార్డు సృష్టించాడు. జకోవిచ్ చారిత్రాత్మక విజయం తర్వాత, నాదల్ 23వ గ్రాండ్ స్లామ్ గెలవడం అసాధ్యమని, కానీ ఇప్పుడు జకోవిచ్ దానిని సాధ్యం చేశాడని ప్రశంసించాడు.