Where is Rohit Sharma: రోహిత్ ఎక్కడ? టీమిండియా కెప్టెన్‌పై ఫ్యాన్స్ సీరియస్
13 October 2022, 17:56 IST
- Where is Rohit Sharma: రోహిత్ శర్మ ఎక్కడ అంటూ టీమిండియా కెప్టెన్‌పై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్ చేయకపోవడమే దీనికి కారణం.
తుది జట్టులో రోహిత్ ఉన్నా అతడు ఫీల్డింగ్, బ్యాటింగ్ చేయలేదు
Where is Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా దూసుకెళ్తోంది. ఈ ఏడాది అతడు కెప్టెన్ అయినప్పటి నుంచీ టీమ్ వరుస విజయాలు సాధిస్తోంది. అయితే ఆ విజయాల్లో రోహిత్ పాత్ర ఎంత? ఈ ఏడాది ఐపీఎల్ నుంచి రోహిత్ ఫామ్ మరీ ఆందోళనకరంగా ఉంది. ఓవైపు విరాట్ కోహ్లి పూర్తిస్థాయి ఫామ్ అందుకున్నా.. రోహిత్ మాత్రం ఇంకా మునుపటి స్థాయి చూపించడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో టీ20 వరల్డ్‌కప్‌లాంటి మెగా టోర్నీకి ముందు ఎన్ని మ్యాచ్‌లు వీలైతే అన్ని మ్యాచ్‌లు ఆడాలి. కానీ రోహిత్ తీరు మరోలా ఉంది. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో అతడు అసలు బ్యాటింగే చేయలేదు. నిజానికి ఈ మ్యాచ్‌లో అతడు తుది జట్టులో ఉన్నాడు. అయినా బ్యాటింగ్‌కు దిగలేదు. దీంతో ట్విటర్‌లో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అటు తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లి కూడా ఈ మ్యాచ్ ఆడలేదు. రెండో మ్యాచ్‌కు సూర్య, చహల్ కూడా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 169 రన్స్ టార్గెట్ చేజ్ చేయడానికి బ్యాటర్లు తంటాలు పడుతున్నా.. రోహిత్ బరిలోకి దిగలేదు. ఇదే ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురి చేసింది. అసలు రోహిత్ ఎక్కడ? బాగానే ఉన్నాడా? లేక అతను కూడా గాయపడ్డాడా అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
తుది జట్టులో రోహిత్ ఉన్నా కూడా ఫీల్డింగ్, బ్యాటింగ్ చేయకపోవడమేంటని ప్రశ్నించారు. రోహిత్ లేకుండా ఇండియా ఓ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా గెలవలేదంటూ మరికొందరు ట్వీట్లు చేశారు. ఈ మ్యాచ్‌లో ఇండియా 36 రన్స్ తేడాతో ఓడిపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 రన్స్ మాత్రమే చేసింది. కేఎల్ రాహుల్ ఒక్కడే 55 బాల్స్‌లో 77 రన్స్ చేశాడు. పంత్ 9, హుడా 6, హార్దిక్ 17, కార్తీక్ 10 రన్స్ చేశారు.
ఇక బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లతో రాణించాడు. హర్షల్ పటేల్ 2, అర్ష్‌దీప్, భువనేశ్వర్, హార్దిక్, దీపక్ తలా ఒక వికెట్ తీశారు. టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడబోయే ముందు ఇండియా రెండు వామప్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో ఈ నెల 17, 19లలో ఆ మ్యాచ్‌లు జరగనున్నాయి.