తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sehwag Slams Warner: వార్నర్‌పై సెహ్వాగ్ ఫైర్.. అలా అయితే ఐపీఎల్ ఆడొద్దని స్పష్టం

Sehwag Slams Warner: వార్నర్‌పై సెహ్వాగ్ ఫైర్.. అలా అయితే ఐపీఎల్ ఆడొద్దని స్పష్టం

09 April 2023, 13:20 IST

google News
    • Sehwag Slams Warner: దిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డారు. నిదానంగా ఆడుతున్నట్లయితే ఐపీఎల్‌కు రావొద్దని స్పష్టం చేశారు. శనివారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ నిదానంగా ఆడటంపై సెహ్వాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
డేవిడ్ వార్నర్
డేవిడ్ వార్నర్ (AFP)

డేవిడ్ వార్నర్

Sehwag Slams Warner: రాజస్థాన్ రాయల్స్‌తో శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ 57 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 55 బంతుల్లో 65 పరుగులు చేసినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. రిషబ్ పంత్ ఐపీఎల్‌కు దూరమవ్వడంతో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న వార్నర్ అంద నిదానంగా బ్యాటింగ్ చేయడంపై పలువురు భారత మాజీ అసహనం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఓ అడుగు ముందుకు వెళ్లి మరి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ విధంగా ఆడేటట్లయితే ఐపీఎల్‌కు రావాల్సిన అవసరం లేదని విమర్శించాడు.

"నేను చెప్పే మాటలు ఇప్పుడు వార్నర్‌ను హర్ట్ చేయవచ్చు. డేవిడ్ నువ్వు వింటున్నావుకుంటున్నా. దయచేసి బాగా ఆడు. 25 బంతుల్లో 50 పరుగులు ఎలా చేయాలో రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను చూసి నేర్చుకో. అతడు 25 బంతుల్లోనే అర్ధశతకం చేశాడు. ఒకవేళ నీకు సాధ్యం కాకపోతే ఐపీఎల్‌కు వచ్చి నువ్వు ఆడాల్సిన అవసరం లేదు." అని సెహ్వాగ్.. వార్నర్‌పై విమర్శలు సంధించాడు.

వార్నర్ త్వరగా ఔటైనా పెద్ద ఇబ్బంది ఉండదని, కానీ నిదానంగా ఆడటం మాత్రం సరికాదని సెహ్వాగ్ స్పష్టం చేశాడు. "డేవిడ్ నువ్వు 55-60 పరుగులు చేసే బదులు 30 పరుగులలోపు ఔటైనా జట్టుకు పెద్దగా ఉండదు. బహుశా ఇంకా మెరుగ్గా ఆడి ఉండేది. త్వరగా ఔటవ్వడం వల్ల రోవ్‌మన్ పోవెల్, ఇషాన్ పోరెల్ లాంటి ఆటగాళ్లు అవకాశముండేది. వారు వచ్చే సమయానికి బంతులు మిగిలి లేవు. ఆ ప్లేయర్లు జట్టులో పెద్ద హిట్టర్లు." అని సెహ్వాగ్ స్పష్టం చేశాడు.

గువహాటీ బర్సాపార వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ 57 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 142 పరుగులే చేయగలిగింది. ఫలితంగా రాజస్థాన్ 57 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ డేవిడ్ వార్నర్(65) అర్ధ శతకంతో ఆకట్టుకున్నప్పటికీ తన జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. రాజస్థాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్ చెరో 3 వికెట్లతో ఆకట్టుకోగా.. అశ్విన్ 2 వికెట్లతో రాణించాడు.

తదుపరి వ్యాసం