తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Southee Equals Dhoni Record: టిమ్ సౌథీ అరుదైన ఘనత.. ధోనీ రికార్డు సమం చేసిన కివీస్ కెప్టెన్

Southee Equals Dhoni Record: టిమ్ సౌథీ అరుదైన ఘనత.. ధోనీ రికార్డు సమం చేసిన కివీస్ కెప్టెన్

25 February 2023, 22:35 IST

google News
    • Southee Equals Dhoni Record: న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ అరుదైన రికార్డు సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండు సిక్సర్లు బాదిన అతడు టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన 15వ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
టిమ్ సౌథీ
టిమ్ సౌథీ (AP)

టిమ్ సౌథీ

Southee Equals Dhoni Record: న్యూజిలాండ్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న ఈ రెండో టెస్టులో కివీస్ కెప్టెన్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేశాడు. టెస్టు క్రికెట్ అత్యదిక సిక్సర్లు బాదిన వారి జాబితాలో ధోనీ 15వ స్థానంలో ఉండగా.. తాజాగా ఆ స్థానాన్ని సౌథీ సమం చేశాడు. ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన టిమ్ సౌథీ ఈ రికార్డు అందుకున్నాడు. ఇప్పటి వరకు సౌథీ 131 ఇన్నింగ్సుల్లో 78 సిక్సర్లు కొట్టాడు. మరోపక్క ధోనీ కూడా తన టెస్టు కెరీర్‌లో 144 ఇన్నింగ్స్‌లు ఆడి 78 సిక్సర్లు బాదాడు. సౌథీ కూడా అన్నే సిక్సర్లు నమోదు చేయడంతో మహీ రికార్డు సమమమైంది. మొత్తంగా అత్యధిక సిక్సర్లు బాదిన టెస్టు బ్యాటర్లలో 15వ స్థానంలో ఉన్నాడు సౌథీ. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా బెన్ స్టోక్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 109 సిక్సర్లతో టాప్‌లో నిలిచాడు.

ప్రస్తుతం టిమ్ సౌథీ బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ అలరిస్తున్నాడు. 700 ఇంటర్నేషనల్ వికెట్లు తీసిన తొలి న్యూజిలాండ్ బౌలర్‌గా సౌథీ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో 18 బంతుల్లో 23 పరుగులు చేసి బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు.

ఈ టెస్టు విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లాండ్ 87.1 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 435 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(169 బంతుల్లో 184) అద్భుత బ్యాటింగ్‌కు తోడు జో రూట్ శతకతం సాధించడంతో ఇంగ్లీష్ జట్టు భారీ స్కోరు సాధించగలిగింది.

తదుపరి వ్యాసం