తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Border Gavaskar Trophy 2023: ఆస్ట్రేలియాపై టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తుంది.. గంగూలీ షాకింగ్ కామెంట్స్

Border Gavaskar Trophy 2023: ఆస్ట్రేలియాపై టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తుంది.. గంగూలీ షాకింగ్ కామెంట్స్

25 February 2023, 20:22 IST

    • Border Gavaskar Trophy 2023: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత్ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా అద్భుతంగా ఆడుతుందని, ఆసీస్‌పై వారు 4-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తారని స్పష్టం చేశారు.
భారత్-ఆస్ట్రేలియా
భారత్-ఆస్ట్రేలియా (PTI)

భారత్-ఆస్ట్రేలియా

Border Gavaskar Trophy 2023: స్వదేశంలో టీమిండియాను ఓడించడం ఎంత పెద్ద జట్టకైనా ఇబ్బందే. ఈ విషయం చాలా సార్లు నిరూపితమైంది. తాజాగా ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్టు కూడా నాలుగు టెస్టుల సిరీస్‌లో 0-2తో వెనకంజలో ఉండటమే కాకుండా భారత్‌ విజయాన్ని ఆపలేకపోతోంది. దీంతో ఉపఖండపు పిచ్‌ల్లో టీమిండియా దుర్బేధ్యంగా కనిపిస్తోంది. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేస్తుందని పలువురు మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఇదే విషయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా స్పష్టం చేశారు. ఆసీస్‌ను భారత్ 4-0 తేడాతో ఓడిస్తుందని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"ఆసీస్‌ను భారత్ 4-0 తేడాతో ఓడిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాను ఓడించడం కంగారూ జట్టుకు కాస్త కష్టమే. ఉపఖండపు పిచ్‌ల్లో భారత్ చాలా ఉన్నతమైన జట్టుగా వెలుగొందుతోంది. విజయం కోసం ఆసీస్ ఆటగాళ్లు చెమటలు చిందించాల్సిందే." అని సౌరవ్ గంగూలీ తెలిపారు.

భారత్ ఇటీవల జరిగిన రెండో టెస్టులో 6 వికెట్ల తేడాతో గెలిచి నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అదిరిపోయే ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతడు 10 వికెట్లు తీశాడు. ఒక్క రెండో ఇన్నింగ్స్‌లోనే 7 వికెట్లతో రాణించాడు.

మొత్తం రెండు టెస్టుల్లో కలిపి జడ్డూ 11.23 సగటుతో 2.84 ఎకానమీ రేట్ ఇస్తూ 17 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. బంతితో పాటు జడేజా బ్యాట్‌తోనూ రాణించాడు. రెండు మ్యాచ్‌ల్లో కలిపి 96 పరుగులు చేశాడు. ఇందులో అత్యధికంగా ఓ మ్యాచ్‌లో 70 పరుగులు చేశాడు. రెండో టెస్టులో ఓటమితో ఆస్ట్రేలియా సిరీస్ గెలవాలనే ఆశ నీరుగారిపోయింది. ఇప్పుడు కేవలం సిరీస్ డ్రా చేసుకోవడానికే వారికి అవకాశముంది.