Serena Williams Retirement: రిటైర్మెంట్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది: సెరెనా విలియమ్స్
09 August 2022, 19:48 IST
Serena Williams Retirement: ఎన్నో ఏళ్లపాటు టెన్నిస్‌ను డామినేట్ చేసిన అమెరికన్ స్టార్ సెరెనా విలియమ్స్ రిటైర్మెంట్‌పై మాట్లాడింది. యూఎస్ ఓపెన్‌కు ముందు ఆమె చేసిన కామెంట్స్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
సెరెనా విలియమ్స్
న్యూయార్క్: కెరీర్‌లో 23 సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన సెరెనా విలియమ్స్ తాను క్రమంగా టెన్నిస్ నుంచి దూరంగా జరుగుతున్నట్లు మంగళవారం (ఆగస్ట్ 9) చెప్పింది. వోగ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె రిటైర్మెంట్‌పై స్పందించింది. టెన్నిస్‌కు ఏడాది పాటు దూరంగా ఉండి ఈసారి వింబుల్డన్‌కు తిరిగొచ్చిన ఆమె.. ఆ తర్వాత సోమవారమే ఓ సింగిల్స్ మ్యాచ్ ఆడింది.
టొరంటో ఓపెన్‌లో భాగంగా తొలి రౌండ్‌లో స్పెయిన్‌కు చెందిన నూరియా పారిజాస్‌పై గెలిచిన రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. అయితే ఈ ఏడాది జరగబోయే యూఎస్ ఓపెనే తన కెరీర్‌లో చివరిది కావచ్చని ఈ మ్యాచ్ తర్వాత సెరెనా హింట్ ఇచ్చింది. "నాకు రిటైర్మెంట్ అన్న పదం ఎప్పుడూ నచ్చదు. అది ఓ మోడర్న్ పదంలాగా నాకు అనిపించదు. దీనిని ఓ మార్పుగా మాత్రమే నేను చూసేదాన్ని. అయితే ఇప్పుడు ఆ పదం వాడాల్సి వస్తోంది" అని 40 ఏళ్ల సెరెనా చెప్పింది.
తాను టెన్నిస్ నుంచి క్రమంగా దూరంగా జరుగుతూ తన జీవితంలోని మిగతా ముఖ్యమైన అంశాలపై దృష్టిసారిస్తున్నట్లు కూడా సెరెనా తెలిపింది. కొన్నేళ్ల కిందట తాను ప్రారంభించిన సెరెనా వెంచర్స్‌పై దృష్టి సారిస్తున్నట్లు చెప్పింది. కెరీర్‌లో అత్యధిక సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన మార్గరెట్ కోర్టు సరసన నిలవడానికి సెరెనా ఒక టైటిల్ దూరంలో ఉంది.
అయితే చివరిసారి 2017లో గ్రాండ్‌స్లామ్ గెలిచిన ఆమె.. ఇప్పటి వరకూ మళ్లీ విజయం సాధించలేదు. 23 టైటిల్స్‌తో ఉన్న సెరెనా.. మరో టైటిల్ కోసం ఐదేళ్లుగా వేచి చూస్తోంది. 2017లో ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్స్ ఫైనల్స్ వరకూ వెళ్లినా.. టైటిల్ సాధించలేకపోయింది. కోర్ట్‌ను దాటలేకపోయినందుకు తనను గ్రేటెస్ట్ ఆఫ్ టైమ్‌గా పిలవడం లేదని, అయితే కోర్ట్ ఓపెన్ ఎరా ప్రారంభానికి ముందు 24 టైటిల్స్ గెలిచిందని సెరెనా చెప్పింది.
తాను ఆ రికార్డు సాధించాలని అనుకుంటున్నట్లు కూడా స్పష్టం చేసింది. తాను గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు వెళ్లినప్పుడు ఆ విషయం ఆలోచిస్తానని, ప్రతి రోజూ అదే ఆలోచనలో ఉండనని చెప్పింది. చివర్లో ఇక తన రిటైర్మెంట్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని, తాను ఓ తల్లిగా దృష్టిసారించాలని, ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించాలని సెరెనా తెలిపింది.