India vs Zimbabwe: రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ధావన్ షాకింగ్ రియాక్షన్.. ఏమైందంటే?
17 August 2022, 7:17 IST
- టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అయోమాయనికి గురయ్యాడు. జింబాబ్వే సిరీస్ సందర్భంగా జరిగిన మీడియా ఇంటరాక్షన్‌లో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న అర్థంకాక బింక ముఖం పెట్టాడు. మరోసారి అడగరా అంటూ ప్రశ్నించాడు.
శిఖర్ ధావన్
Shikhar Dhawan Surprising Reaction: జింబాబ్వేతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 18 నుంచి ఈ సిరీస్ జరగనుంది. తొలుత ఈ వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా నియమించగా.. అనంతరం కేఎల్ రాహుల్ కోలుకోవడంతో అతడికి బాధ్యతలు అప్పగించారు. అయితే తన నుంచి కెప్టెన్సీ దూరమైనప్పటికీ ధావన్.. చాలా ఆత్మవిశ్వాసంతో ఉండటం విశేషం. జింబాబ్వేతో సిరీస్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అతడు.. కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అయితే రిపోర్టర్ భాష అర్థం కాక అయోమయానికి గురయ్యాడు మన గబ్బర్. బింకి ముఖం వేసి మరోసారి ప్రశ్న అడగాల్సిదింగా కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
"ఈ మధ్య కాలంలో జింబాబ్వే పెద్దగా రాణించడం లేదు. ఇండియాతో పెద్దగా మ్యాచ్‌లు కూడా ఆడింది లేదు వారిపై గెలవడం సులవునేనని భావిస్తున్నారా?" అని రిపోర్టర్ ధావన్‌ను ప్రశ్నించారు. అయితే రిపోర్టర్ తన యాసలో వేగంగా అడగడంతో ధావన్ అయమోయానికి గురయ్యాడు. "మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థం కాలేదు.. మరోసారి అడగరా?" అని అంటాడు. ఈ సారి సదరు రిపోర్టర్ అడిగిన ప్రశ్నను ఏకాగ్రతతో విని సమాధానమిస్తాడు.
"జింబాబ్వేతో మేము ఆడటం ప్రపంచ క్రికెట్‌కు చాలా మంచిదని భావిస్తున్నాం. అలాంటి నాణ్యమైన జట్టు ఆడటం మాకు కూడా మేలు జరుగుతుందని భావిస్తున్నాను. ఇది వారికి ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. అలాగే మా యువకులకు నిరూపించుకోవడానికి మంచి అవకాశం. విభిన్న పరిస్థితుల్లో వచ్చి ఆడటం ఎప్పుడూ సవాలే. ఈ సిరీస్‌ను గెలవడం భిన్నమేం కాదు. జింబాబ్వే కూడా మెరుగ్గా రాణిస్తుందని అనుకుంటున్నా" అని ధావన్ స్పష్టం చేశాడు.
1998 నుంచి 2000 మధ్య కాలం వరకు భారత్-జింబాబ్వే మధ్య చాలా వరకు ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు పెద్దగా జరగడం లేదు. క్యాలెండర్ ఇయర్‌లో ఈ రెండు జట్లకు మ్యాచ్‌లకు అవకాశమే ఉండట్లేదు. మధ్యలో జరిగిన టీమిండియా స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తున్నారు. అయితే జింబాబ్వే అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు ఎందుకంటే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరీస్ నెగ్గి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.