తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shardul Thakur To Kkr: శార్దూల్‌ ఠాకూర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అమ్మేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌

Shardul Thakur to KKR: శార్దూల్‌ ఠాకూర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అమ్మేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌

Hari Prasad S HT Telugu

14 November 2022, 15:22 IST

google News
    • Shardul Thakur to KKR: శార్దూల్‌ ఠాకూర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అమ్మేసింది ఢిల్లీ క్యాపిటల్స్‌. అతన్ని 2022 ఐపీఎల్‌ మెగా వేలంలో రూ.10.75 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
శార్దూల్ ఠాకూర్
శార్దూల్ ఠాకూర్ (BCCI Twitter)

శార్దూల్ ఠాకూర్

Shardul Thakur to KKR: ఐపీఎల్‌ 2023 మినీ వేలానికి ముందు టీమ్స్‌ తమ ప్లేయర్స్‌ను అటూఇటూ మార్చుకునే పనిలో ఉన్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ మరో ప్లేయర్‌ను అమ్మేసింది. స్టార్‌ పేస్‌బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ను ఆ టీమ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టీమ్‌కు అమ్మేసింది. గత వేలంలో శార్దూల్‌ను ఢిల్లీ టీమ్‌ రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది.

సోమవారమే (నవంబర్‌ 14) ఈ డీల్‌ పూర్తయినట్లు తెలిసింది. ప్రస్తుతం శార్దూల్‌ ఠాకూర్‌ టీమిండియాతో కలిసి న్యూజిలాండ్‌ టూర్‌లో ఉన్నాడు. గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌కు ఆడిన శార్దూల్‌ను గత వేలంలో ఢిల్లీ కొనుక్కుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో అతడు పెద్దగా రాణించలేకపోయాడు. 14 మ్యాచ్‌లలో 15 వికెట్లు తీశాడు. అటు బ్యాట్‌తోనూ కేవలం 120 రన్స్‌ మాత్రమే చేయగలిగాడు.

2017 ఐపీఎల్‌ తర్వాత అతని చెత్త ప్రదర్శన ఇదే. దీంతో శార్దూల్‌ను వేరే టీమ్‌ను ఇచ్చేయాలని ఢిల్లీ నిర్ణయించింది. వచ్చే నెల 23న వేలం నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం మంగళవారం (నవంబర్‌ 15)లోపు ప్లేయర్స్‌ ట్రేడ్‌ డీల్స్‌ పూర్తి కావాల్సి ఉంది. శార్దూల్‌ కోసం చెన్నై, గుజరాత్‌ టైటన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ కూడా ప్రయత్నించినా.. చివరికి కోల్‌కతాకు అమ్మేసింది.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇప్పటికే ఇలాంటివి మూడు డీల్స్‌ కుదుర్చుకుంది. గుజరాత్‌ టైటన్స్ నుంచి లాకీ ఫెర్గూసన్, రహ్మానుల్లా గుర్బాజ్‌లను కోల్‌కతా కొనుగోలు చేసింది. ఇప్పుడూ శార్దూల్‌న కూడా తీసుకోవడంతో ఆ టీమ్‌ మరింత స్ట్రాంగ్‌గా మారింది.

మరోవైపు ఇంగ్లండ్‌ బ్యాటర్‌, కోల్‌కతా టీమ్‌లోనే ఉన్న సామ్‌ బిల్లింగ్స్ ఈసారి ఐపీఎల్‌లో ఆడకూడదని నిర్ణయించాడు. టెస్ట్‌ క్రికెట్‌పై దృష్టిసారించడానికి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిల్లింగ్స్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. ఇది కఠిన నిర్ణయమే అయినా తప్పడం లేదని అన్నాడు. తనకు అవకాశం ఇచ్చిన కోల్‌కతా టీమ్‌కు థ్యాంక్స్‌ చెప్పాడు.

టాపిక్

తదుపరి వ్యాసం