తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shahid Afridi Shaheen Afridi: అల్లుడు షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన మామ షాహిద్ అఫ్రిది.. వీడియో వైరల్

Shahid Afridi Shaheen Afridi: అల్లుడు షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన మామ షాహిద్ అఫ్రిది.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu

03 February 2023, 16:06 IST

    • Shahid Afridi Shaheen Afridi: కాబోయే అల్లుడు షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో సిక్స్ కొట్టాడు మామ షాహిద్ అఫ్రిది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు సిక్స్ ఎలా కొట్టాలో తర్వాత తన అల్లుడికి నేర్పించాడతడు.
షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో సిక్స్ కొడుతున్న షాహిద్ అఫ్రిది.. తర్వాత షాహీన్ కు సిక్స్ ఎలా కొట్టాలో చూపిస్తున్న షాహిద్
షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో సిక్స్ కొడుతున్న షాహిద్ అఫ్రిది.. తర్వాత షాహీన్ కు సిక్స్ ఎలా కొట్టాలో చూపిస్తున్న షాహిద్ (Screengrab)

షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో సిక్స్ కొడుతున్న షాహిద్ అఫ్రిది.. తర్వాత షాహీన్ కు సిక్స్ ఎలా కొట్టాలో చూపిస్తున్న షాహిద్

Shahid Afridi Shaheen Afridi: మామా అల్లుళ్ల మధ్య క్రికెట్ పిచ్ పై పోటీ గట్టిగానే సాగింది. ప్రపంచంలోని మేటి బౌలర్లలో ఒకడిగా పేరుగాంచిన తన కాబోయే అల్లుడు షాహీన్ షా అఫ్రిదికి తన బ్యాటింగ్ రుచి చూపించాడు మామ షాహిద్ అఫ్రిది. తన కూతురిని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న షాహీన్ కి సిక్స్ రూపంలో ఓ మంచి గిఫ్ట్ ఇచ్చాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఓ వాపమ్ ప్రాక్టీస్ మ్యాచ్ లో మామ షాహిద్ కు బౌలింగ్ చేశాడు అల్లుడు షాహీన్. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న షాహీన్.. తిరిగి అంతర్జాతీయ క్రికెట్ లోకి రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అంతకుముందు పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. తన రీహ్యాబిలిటేషన్ లో భాగంగా పాకిస్థాన్ సపోర్ట్ స్టాఫ్ తో కలిసి షాహీన్ ఓ మ్యాచ్ ఆడాడు.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో షాహీన్ వేసి ఓవర్ పిచ్ బాల్ ను షాహిద్ అఫ్రిది సిక్స్ గా మలచడం చూడొచ్చు. ఆ బంతిని నేరుగా షాహీన్ తలమీదుగానే అఫ్రిది బౌండరీ అవతలికి పంపించాడు. ఆ తర్వాత మరో వీడియోలో షాహిద్ కూడా పిచ్ పై నిల్చొని బాల్ వేయగా.. షాహీన్ దానిని సిక్స్ కొట్టాడు. ఈ సందర్భంగా తన కాబోయే అల్లుడికి సిక్స్ ఎలా కొట్టాలో కూడా అఫ్రిది చూపించడం ఈ వీడియోలో కనిపిస్తుంది.

ప్రస్తుతం షాహిద్ అఫ్రిది పాకిస్థాన్ టీమ్ సెలక్షన్ కమిటీ తాత్కాలిక ఛీఫ్ గా ఉన్నాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్ సందర్భంగా షాహీన్ మోకాలికి గాయమైంది. ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్లో ఓ క్యాచ్ అందుకోబోయే అతను గాయపడ్డాడు. దీంతో ఫైనల్లో కీలకమైన సమయంలో అతడు మళ్లీ బౌలింగ్ చేయలేకపోయాడు. అంతకుముందు తగిలిన గాయం దీని కారణంగా మరింత తీవ్రమైనట్లు తర్వాత తేలింది.

ఇక షాహీన్ పెళ్లి విషయానికి వస్తే అతడు శుక్రవారమే (ఫిబ్రవరి 3) షాహిద్ అఫ్రిది కూతురు అన్షాను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఇద్దరు పాకిస్థాన్ క్రికెటర్లు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. హరీస్ రవూఫ్, షాదాబ్ ఖాన్ లు గత జనవరిలో పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు షాహీన్ కూడా ఆ లిస్ట్ లో చేరనున్నాడు.

టాపిక్

తదుపరి వ్యాసం