IPL Media Rights : పాకిస్థాన్ సూపర్ లీగ్ కంటే.. వుమెన్స్‌ ఐపీఎల్ మీడియా రైట్సే ఎక్కువ-wipl media rights cost per match more than men s psl as bcci set to earn 7 crore per match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Media Rights : పాకిస్థాన్ సూపర్ లీగ్ కంటే.. వుమెన్స్‌ ఐపీఎల్ మీడియా రైట్సే ఎక్కువ

IPL Media Rights : పాకిస్థాన్ సూపర్ లీగ్ కంటే.. వుమెన్స్‌ ఐపీఎల్ మీడియా రైట్సే ఎక్కువ

Anand Sai HT Telugu
Jan 17, 2023 03:59 PM IST

WIPL 2023 Media Rights : ఇండియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్ మీడియా హక్కుల ఆదాయంలో చాలా తేడా ఉంది. ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్.. మీడియా హక్కులను సైతం బీసీసీఐ విక్రయించింది.

మహిళల ఐపీఎల్ మీడియా హక్కులు
మహిళల ఐపీఎల్ మీడియా హక్కులు

ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(WIPL) మీడియా హక్కులను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) విక్రయించింది. రిలయన్స్‌కు చెందిన వయాకామ్18కు రూ.951 కోట్లకు ఇచ్చింది. మహిళల ఐపీఎల్(Womens IPL) ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. Spots-18, Jio యాప్‌లలో 2023 నుండి 2027 వరకు ప్రసారమయ్యే సీజన్‌లను చూసే ఐదేళ్ల ఒప్పందంలో భాగంగా మహిళల IPL మీడియా హక్కులు విక్రయించారు.

మహిళల ఐపీఎల్(IPL) ప్రసార హక్కులను బీసీసీఐ(BCCI) రూ.951 కోట్లకు విక్రయించింది. అంటే ఒక్కో మ్యాచ్‌కు రూ.7.09 కోట్లు. ఇక్కడ విశేషమేమిటంటే, ఇది పాకిస్థాన్ సూపర్ లీగ్(pakistan super league) మ్యాచ్‌కు మీడియా హక్కుల(Media Rights) ఆదాయం కంటే ఎక్కువ. అంటే మహిళల ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్ ప్రసార హక్కులు రూ.7.09 కోట్లకు అమ్ముడుపోగా, పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఒక్కో మ్యాచ్ మీడియా హక్కులు రూ.2.44 కోట్లకే అమ్ముడయ్యాయి. అంటే పీఎస్‌ఎల్ మీడియా హక్కుల(PSL Media Rights) కంటే మహిళల ఐపీఎల్ మూడు రెట్లు ఎక్కువ ఆదాయాన్ని తెస్తుంది.

పురుషుల ఇండియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్‌ల మీడియా హక్కుల ఆదాయాన్ని పరిశీలిస్తే, భారీ వ్యత్యాసం ఉంది. ఇక్కడ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు PSL ప్రతి మ్యాచ్ నుండి 2.44 కోట్లు సంపాదిస్తుంది. అయితే BCCI.. IPL ద్వారా ప్రతి మ్యాచ్ నుండి 107.5 కోట్లు సంపాదిస్తుంది. అంటే పీఎస్‌ఎల్ కంటే ఐపీఎల్‌కు చాలా రెట్లు ఎక్కువ విలువ ఉంది.

వుమెన్స్ ఐపీఎల్ లో వచ్చే ఐదేళ్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.7.09 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని బీసీసీఐ(BCCI) సెక్రటరీ జైషా చెప్పారు. క్లోజ్డ్-బిడ్ వేలంలో డిస్నీ స్టార్, సోనీతో సహా ఇతర బిడ్డర్‌లను దాటి.. వయాకామ్ 18 ఐదేళ్లకు రూ.951 కోట్లకు రాబోయే మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను స్వాధీనం చేసుకున్నట్లుగా బిసీసీఐ ప్రకటించింది. అంటే ప్రతి మ్యాచ్‌కి బోర్డు రూ.7.90 కోట్లు వస్తాయి. ఇది పురుషుల పాకిస్తాన్ సూపర్ లీగ్(PSL) మీడియా హక్కుల కంటే ఎక్కువ.

క్రికెట్ బోర్డు సోమవారం ముంబైలో వేలం నిర్వహించింది. మార్చి మొదటి వారంలో మహిళల ఐపీఎల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఐదు జట్లు పోటీపడతాయి. అన్ని మ్యాచ్‌లు ముంబైలో జరుగుతాయి.

'కొన్ని సంవత్సరాల నుండి మహిళల క్రికెట్ పుంజుకుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన ద్వైపాక్షిక సిరీస్ భారతదేశంలో మహిళల క్రికెట్ ఎంత ప్రజాదరణ పొందిందో చెప్పడానికి గొప్ప నిదర్శనం.' అని BCCI అధ్యక్షుడు రోజర్ బిన్నీ బోర్డు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

Whats_app_banner