తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shaheen Afridi To Tie Knot: షాహిద్‌ అఫ్రిది కూతురిని పెళ్లి చేసుకోనున్న షాహీన్‌ అఫ్రిది.. డేట్‌ ఫిక్స్‌

Shaheen Afridi to tie knot: షాహిద్‌ అఫ్రిది కూతురిని పెళ్లి చేసుకోనున్న షాహీన్‌ అఫ్రిది.. డేట్‌ ఫిక్స్‌

Hari Prasad S HT Telugu

21 December 2022, 21:44 IST

    • Shaheen Afridi to tie knot: షాహిద్‌ అఫ్రిది కూతురిని పెళ్లి చేసుకోనున్నాడు షాహీన్‌ అఫ్రిది. ఈ ఇద్దరి పెళ్లి డేట్‌ కూడా ఫిక్స్‌ చేసినట్లు షాహిద్‌ అఫ్రిది చెప్పడం విశేషం.
షాహిద్ అఫ్రిది కూతురును అన్షాను పెళ్లి చేసుకోబోతున్న షాహీన్ షా అఫ్రిది
షాహిద్ అఫ్రిది కూతురును అన్షాను పెళ్లి చేసుకోబోతున్న షాహీన్ షా అఫ్రిది (Twitter)

షాహిద్ అఫ్రిది కూతురును అన్షాను పెళ్లి చేసుకోబోతున్న షాహీన్ షా అఫ్రిది

Shaheen Afridi to tie knot: పాకిస్థాన్‌ స్టార్‌ పేస్‌ బౌలర్‌ షాహీన్‌ షా అఫ్రిది.. ఆ టీమ్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది కూతురిని పెళ్లి చేసుకోబోతున్నాడు. నిజానికి ఈ వార్తలు గత ఏడాది నుంచే వస్తున్నా.. ఇప్పుడీ జంట పెళ్లి ముహూర్తం కూడా ఖరారైంది. నిఖా తేదీని ఫిక్స్‌ చేసినట్లు షాహిద్‌ అఫ్రిది వెల్లడించాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3న వీళ్లిద్దరూ పెళ్లితో ఒక్కటవ్వనున్నట్లు తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ విషయాన్ని క్రికెట్‌ పాకిస్థాన్‌ వెల్లడించింది. షాహిద్‌ అఫ్రిది కూతురు అన్షాను షాహీన్‌ పెళ్లి చేసుకోబోతున్నాడు. వీళ్ల పెళ్లి కరాచీలో జరగనున్నట్లు క్రికెట్‌ పాకిస్థాన్‌ తెలిపింది. నిఖా తర్వాత గ్రాండ్‌గా వెడ్డింగ్‌ రిసెప్షన్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు.

షాహీన్‌ ప్రస్తుతం అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ నుంచి కోలుకుంటున్నాడు. దీంతో నేషనల్‌ టీమ్‌కు అతడు దూరంగా ఉన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌ టీమ్‌కు ఆడిన షాహీన్.. ఫైనల్లో కీలకమైన సమయంలో గాయపడటంతో తన టీమ్‌ను గెలిపించలేకపోయాడు.

ఆ తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. అతడు లేని పాకిస్థాన్‌ బౌలింగ్‌ బలహీనంగా మారిపోవడంతో ఇంగ్లండ్‌ టీమ్‌ పాక్‌ను వాళ్ల సొంతగడ్డపై మూడు టెస్ట్‌ల సిరీస్‌లో వైట్‌ వాష్‌ చేసింది. 2021లో షాహీన్‌ షా అఫ్రిది ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు గెలుచుకున్న తొలి పాకిస్థానీ ప్లేయర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకూ పాక్‌ టీమ్‌ తరఫున 25 టెస్టుల్లో 99 వికెట్లు, 32 వన్డేల్లో 62 వికెట్లు, 47 టీ20ల్లో 58 వికెట్లు తీశాడు.

టాపిక్

తదుపరి వ్యాసం