తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ponting On Wtc Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌పై పాంటింగ్ జోస్యం.. విన్నింగ్ ఛాన్స్ ఎవరికి ఎక్కువుందో చెప్పిన మాజీ ప్లేయర్

Ponting on WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌పై పాంటింగ్ జోస్యం.. విన్నింగ్ ఛాన్స్ ఎవరికి ఎక్కువుందో చెప్పిన మాజీ ప్లేయర్

19 May 2023, 22:06 IST

    • Ponting on WTC Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్-ఆస్ట్రేలియా అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్‌లో విన్నింగ్ ఛాన్స్ ఎక్కువగా ఎవరికి ఉందో పాంటింగ్ చెప్పేశారు. లండన్ ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
రికీ పాంటింగ్
రికీ పాంటింగ్ (Action Images via Reuters)

రికీ పాంటింగ్

Ponting on WTC Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ దగ్గర పడుతున్న తరుణంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూన్ 7న లండన్ ఓవల్ వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఈ తుది పోరు నిర్వహించనున్నారు. ఈ ఏడాది జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సొంతం చేసుకున్న టీమిండియా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించి.. ఆసీస్‌తోనే తలపడనుంది. దీంతో మరికొన్ని రోజుల్లో ఈ ఫైనల్ జరగనుండటంతో ఎవరు గెలుస్తారనే విషయంపై చర్చ జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు. ఆసీస్‌కే విన్నింగ్ ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

"ఓవల్ పిచ్ ఆస్ట్రేలియన్ వికెట్‌ మాదిరిగానే ఉంటుంది. ఇండియా కంటే ఆసీస్‌కు ఇక్కడ కొంచెం అనుకూలించే అవకాశముంది. ఎడ్జ్‌లో ఆస్ట్రేలియాకే గెలిచే ఛాన్స్ ఉంది. అదే ఈ మ్యాచ్ భారత్‌లో జరిగితే.. ఆ జట్టుకు విజయావకాశాలు మెండుగా ఉండేవని చెప్పావాడిని. లేదా ఆస్ట్రేలియా జరిగేతే.. ఆసీస్‌కు ఛాన్స్ ఉండేది. కానీ ఇంగ్లాండ్ పిచ్ రెండు జట్లకు విజయం లిటిల్ క్లోజ్‌గా ఉండే అవకాశముంది." అని పాంటింగ్ తెలిపాడు.

గతంతో పోలిస్తే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ బాగా మెరుగుపడిందని పాంటింగ్ అన్నాడు.

"1990వ దశకం చివరలో లేదా 2000వ దశకం ప్రారంభంతో పోలిస్తే ఇప్పుడు భారత్ విదేశీ పిచ్‌ల్లో మెరుగ్గా ఆడుతోంది. బ్యాటింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. ఇక టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఛతేశ్వర్ పుజారాతో ఆస్ట్రేలియా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అతడు విదేశీ పరిస్థితుల్లో అత్యుత్తమంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ససెక్స్ తరఫున ఆడి.. ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడ్డాడు. స్టీవ్ స్మిత్ కూడా మార్నస్ లబుషేన్‌తో కలిసి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కాబట్టి ఈ మ్యాచ్ భారత్ టాపార్డర్‌కు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ మధ్య జరుగుతుంది. చూసేందుకు మ్యాచ్ రసవత్తరంగా ఉండవచ్చు." అని రికీ పాంటింగ్ స్పష్టం చేశాడు.

జూన్ 7 లండన్ ఓవల్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్-ఆస్ట్రేలియా ఈ తుదిపోరులో పోటీ పడనున్నాయి. ఇప్పటికే గత డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓడి రన్నరప్‌గా నిలిచిన భారత్.. ఈ సారి మాత్రం టెస్టు ఛాంపియన్‌షిప్ కిరీటాన్ని సొంతం చేసుకోవాలని చూస్తోంది.

తదుపరి వ్యాసం