తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ravi Shastri Warns : బుమ్రా గురించి బీసీసీఐని హెచ్చరించిన రవిశాస్త్రీ

Ravi Shastri Warns : బుమ్రా గురించి బీసీసీఐని హెచ్చరించిన రవిశాస్త్రీ

Anand Sai HT Telugu

25 June 2023, 5:28 IST

google News
    • Ravi Shastri On Bumrah : టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా గతేడాది సెప్టెంబర్ నుంచి క్రికెట్‌కు దూరమయ్యాడు. బుమ్రా గురించి. బీసీసీఐని రవిశస్త్రీ హెచ్చరించాడు.
జస్ప్రీత్ బుమ్రా
జస్ప్రీత్ బుమ్రా (twitter)

జస్ప్రీత్ బుమ్రా

2022 T20 ప్రపంచకప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌(WTC Final)తో సహా ప్రధాన క్రికెట్ టోర్నమెంట్‌లలో టీమ్ ఇండియా బుమ్రా సేవలను కోల్పోయింది. ఫిట్ నెస్ కారణంగా బుమ్రా కొన్ని రోజులుగా దూరంగా ఉన్నాడు. అయితే ఈ ఏడాది చివర్లో భారత్‌లో వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. ఆ టోర్నీకి ముందు బుమ్రా పూర్తిగా ఫిట్‌గా ఉండాలనేది టీమ్ ఇండియా(Team India) మేనేజ్‌మెంట్ అంచనా. దాదాపు ఫిట్‌గా ఉన్న బుమ్రాను ఐర్లాండ్‌తో జరిగే తదుపరి సిరీస్‌లో మళ్లీ జట్టులోకి తీసుకురావాలనేది బీసీసీఐ ప్లాన్. అయితే ఈ సందర్భంగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి బుమ్రా గురించి వార్నింగ్ ఇచ్చాడు.

ఓ ఇంటర్వ్యూలో మాజీ కోచ్ రవిశాస్త్రి వన్డే ప్రపంచ కప్‌కు ముందు ఆడేందుకు సిద్ధంగా ఉండాలని, బుమ్రా(Bumrah)ను ఆడించేందుకు తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని హెచ్చరించాడు. జస్ప్రీత్ బుమ్రా చాలా ముఖ్యమైన క్రికెటర్ అని, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని అన్నాడు.

'బుమ్రా చాలా ముఖ్యమైన క్రికెటర్. కానీ ప్రపంచకప్ నేపథ్యంలో మీరు హడావుడి చేస్తే అతన్ని మరో నాలుగు నెలల పాటు కోల్పోవచ్చు. షాహీన్ అఫ్రిదిలా ఇది జరగవచ్చు. ఇది చాలా సున్నితమైన అంశం. జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి.' అని రవి శాస్త్రి అన్నాడు.

సెప్టెంబర్ 2022లో బుమ్రా క్రికెట్ మైదానానికి దూరంగా ఉన్నాడు. 2022 T20 ప్రపంచ కప్‌కు ముందు పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి రావడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి, కానీ విఫలమయ్యాయి. బుమ్రా తర్వాత న్యూజిలాండ్‌లో వెన్ను శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం దాదాపు ఫిట్‌గా ఉన్న బుమ్రా.. టీమ్ ఇండియాకు తిరిగి వచ్చేందుకు తన చివరి శిక్షణను తీసుకుంటున్నాడు.

ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో జస్‍ప్రీత్ బుమ్రా సిద్ధమవుతున్నాడు. అయితే, బుమ్రాను త్వరలో రంగంలోకి దించాలని బీసీసీఐ, ఎన్‍సీఏ భావిస్తోంది. వర్క్ లోడ్ ఎక్కువగా ఉండే వన్డేల కంటే.. బుమ్రా ఫిట్‍నెస్ లెవెల్స్‌ను పరీక్షించేందుకు టీ20లే బెస్ట్ అని సెలెక్టర్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఐర్లాండ్‍తో ఆగస్టులో టీమిండియా ఆడే టీ20 సిరీస్‍లో బుమ్రాను ఆడించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం.

తదుపరి వ్యాసం