World Cup Schedule : అక్టోబర్ 15న భారత్ Vs పాకిస్థాన్.. వన్డే ప్రపంచకప్ టైమ్ టేబుల్ ఇదే!
World Cup Schedule : క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతుంది. పాకిస్థాన్ పాల్గొంటుందా? భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు అని చాలామందికి ఆసక్తిగా ఉంది.
త్వరలో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్(ICC ODI World Cup) తాత్కాలిక షెడ్యూల్ విడుదల కాగా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. నివేదికల ప్రకారం, ఆతిథ్య భారత్.. ఆగస్టు 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో టోర్నీ ప్రారంభ మ్యాచ్ ఆడనుంది. 15వ తేదీ ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narenda Modi Stadium)లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. అయితే పాకిస్థాన్ మాత్రం.. ఇక్కడ మ్యాచ్ ఆడమని చెబుతుంది.
టోర్నీకి సంబంధించిన ప్రొవిజనల్ షెడ్యూల్‌ను బీసీసీఐ(BCCI) సిద్ధం చేసి ఐసీసీకి ఇచ్చిందని, త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు నవంబర్ 15, 16 తేదీలలో జరుగుతాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం, చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్నాయి. నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టోర్నీలో భారత్‌తో సహా 10 జట్లు పాల్గొననుండగా, 8 జట్లు నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన రెండు జట్లు క్వాలిఫికేషన్ రౌండ్ ద్వారా ప్రధాన రౌండ్‌లోకి ప్రవేశిస్తాయి.
భారత్ తన లీగ్ స్థాయి మ్యాచ్‌లను బెంగళూరు సహా 9 స్టేడియాల్లో ఆడనుంది. 8న చెన్నైలో ఆసీస్, 11న ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్, 15న అహ్మదాబాద్‌లో పాకిస్థాన్, 19న పూణెలో బంగ్లాదేశ్, 22న ధర్మశాలలో న్యూజిలాండ్, 29న లక్నోలో ఇంగ్లండ్‌తో భారత్ ఆడుతుంది. నవంబర్ 2న క్వాలిఫయింగ్ రౌండ్, నవంబర్ 5న కోల్‌కతాలో దక్షిణాఫ్రికా, నవంబర్ 11న బెంగళూరులో మరో క్వాలిఫయర్ జట్టుతో ఆడుతుంది.
తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం, పాకిస్తాన్ తన మ్యాచ్‌లను 5 స్టేడియాల్లో ఆడుతుంది. బెంగళూరు 2 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. నవంబరు 20న ఆస్ట్రేలియాతోనూ, నవంబర్ 5న న్యూజిలాండ్‌తోనూ చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది పాకిస్థాన్(Pakistan).
2023 ICC ODI ప్రపంచ కప్ టోర్నమెంట్ అక్టోబర్ 05 నుండి నవంబర్ 19 వరకు జరుగుతుంది. 10 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గౌహతి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్, ముంబై, తిరువనంతపురం సహా దేశవ్యాప్తంగా మొత్తం 12 నగరాల్లో ఈ టోర్నీలు జరగనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్(Hyderabad) ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఉండదని చెబుతున్నారు. 2023 ODI ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు ఇప్పటికే ఎనిమిది జట్లు నేరుగా అర్హత సాధించగా, మరో రెండు జట్లు క్వాలిఫైయింగ్ రౌండ్‌లో విజయం సాధించడం ద్వారా ODI ప్రపంచ కప్ ప్రధాన రౌండ్‌కు అర్హత సాధిస్తాయి.
ఆతిథ్య భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు ఇప్పటికే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి. తాజాగా దక్షిణాఫ్రికా జట్టు కూడా ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధించింది.