IPL 2023 Dot Balls : ఐపీఎల్ డాట్ బాల్స్.. బీసీసీఐ ఎన్ని మెుక్కలు నాటనుందో తెలుసా?-ipl 2023 total dot balls in ipl playoff 2023 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ipl 2023 Total Dot Balls In Ipl Playoff 2023

IPL 2023 Dot Balls : ఐపీఎల్ డాట్ బాల్స్.. బీసీసీఐ ఎన్ని మెుక్కలు నాటనుందో తెలుసా?

Anand Sai HT Telugu
May 31, 2023 08:16 AM IST

IPL 2023 Dot Balls : ఐపీఎల్ 16వ సీజన్ ముగిసింది. ప్లేఆఫ్ మ్యాచ్‌ల సమయంలో డాట్ బాల్ స్థానంలో ఆకుపచ్చ చెట్టు ఇమేజ్ గ్రాఫిక్ కనిపిస్తూ వచ్చింది. దీని వెనక ఓ మంచి కారణం ఉంది.

ఐపీఎల్ డాట్ బాల్స్
ఐపీఎల్ డాట్ బాల్స్ (unsplash)

IPL 2023 : ఈ IPL ప్లేఆఫ్స్ మ్యాచ్‌కు ముందు BCCI కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా, ప్లేఆఫ్స్ మ్యాచ్‌లలో చేసిన ప్రతి డాట్ బాల్‌(Dot Ball)కు, టాటా కంపెనీ భాగస్వామ్యంతో 500 మొక్కలు నాటనున్నట్లు BCCI ప్రకటించింది. ఈ కారణంగా, ప్లేఆఫ్‌ల సమయంలో డాట్ బాల్ స్థానంలో గ్రీన్ ట్రీ ఇమేజ్ గ్రాఫిక్ ఉపయోగించారు. ఇప్పుడు ఐపీఎల్ 16వ సీజన్ ముగిసింది. ప్లేఆఫ్స్ దశలో ఆడిన మొత్తం 4 గేమ్‌ల్లో ఎన్ని డాట్ బాల్స్ ఆడారు అనేదానికి ఇదిగో సమాధానం.

ట్రెండింగ్ వార్తలు

గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్(GT Vs CSK) మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు 40 ఓవర్లలో మొత్తం 84 డాట్ బాల్స్ వేశారు. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు చేసిన మొత్తం డాట్ బాల్స్ సంఖ్య 96.

ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్(MI Vs GT) మధ్య జరిగిన 2వ క్వాలిఫయర్ మ్యాచ్‌లో కేవలం 67 డాట్ బాల్స్ మాత్రమే వచ్చాయి. అలాగే చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొత్తం డాట్ బాల్స్ 45. అంటే 4 మ్యాచ్‌ల నుంచి మొత్తం 292 డాట్ బాల్స్ ఉన్నాయి.

అంటే 292 x 500 లెక్కల ప్రకారం టాటా సహకారంతో బీసీసీఐ(BCC() మొత్తం 1 లక్షా 46 వేల మొక్కలు నాటనుంది. దీని ద్వారా గ్రీన్ డాట్ ప్రచారంలో ఐపీఎల్ హరిత విప్లవానికి శ్రీకారం చుట్టడం విశేషం. పర్యావరణం పట్ల బీసీసీఐ బాధ్యతగా వ్యవహరిస్తూ ఈ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియా(Social Media)లో దీనిపై చాలా మంది రియాక్టయ్యారు. నిజానికి ఈ సీజన్ ఐపీఎల్లో ఇలాంటి కార్యక్రమాలను ఆయా ఫ్రాంఛైజీలు కూడా చేపట్టడం విశేషం.

ఆర్సీబీ టీమ్(RCB Team) ప్రతి సీజన్ లో ఒక మ్యాచ్ తమ రెగ్యులర్ జెర్సీల్లో కాకుండా గ్రీన్ జెర్సీల్లో ఆడుతుంది. పర్యావరణం పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్న సందేశం ఇస్తూ ఆర్సీబీ టీమ్ ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ ఏడాది గుజరాత్ టైటన్స్ కూడా ఒక మ్యాచ్ లో లావెండర్ జెర్సీల్లో బరిలోకి దిగింది. క్యాన్సర్ పై అవగాహన కల్పించే ఉద్దేశంతో వాళ్లు అలా చేశారు. బీసీసీఐ(BCCI) కూడా ఇలా డాట్ బాల్ కు మొక్కలు నాటాలన్న నిర్ణయంతో క్రికెట్ అభిమానుల మెప్పు పొందుతోంది.

WhatsApp channel