తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ravi Shastri On Wtc Final: అందరూ ఆస్ట్రేలియా ఫేవరెట్ అంటున్నారు కానీ..: రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ravi Shastri on WTC Final: అందరూ ఆస్ట్రేలియా ఫేవరెట్ అంటున్నారు కానీ..: రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

03 June 2023, 10:41 IST

    • Ravi Shastri on WTC Final: అందరూ ఆస్ట్రేలియా ఫేవరెట్ అంటున్నారు కానీ ఒక్క రోజు వాళ్లది కాకపోయినా తలకిందులు అవుతుందంటూ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
రవిశాస్త్రి
రవిశాస్త్రి (Getty)

రవిశాస్త్రి

Ravi Shastri on WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పదేళ్లుగా ఓ ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్న ఇండియన్ టీమ్ తోపాటు ఫైనల్లో ఆస్ట్రేలియా విజయావకాశాల గురించి స్పందించాడు. అందరూ ఆస్ట్రేలియా జట్టును ఫేవరెట్ అంటున్నారు కానీ.. ఒక్క రోజు వాళ్లది కాకపోయినా మ్యాచ్ చేజారినట్లే అని శాస్త్రి అనడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7 నుంచి 11 వరకూ లండన్ లోని ఓవల్ గ్రౌండ్లో జరగనుంది. దీనికోసం ఇప్పటికే రెండు జట్లు ప్రాక్టీస్ ప్రారంభించాయి. చివరిసారి ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిపోయినప్పుడు రవిశాస్త్రియే హెడ్ కోచ్ గా ఉన్నాడు. అయితే ఈసారి మాత్రం ఇండియన్ టీమ్ తమ పదేళ్ల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ ఐసీసీ ట్రోఫీ గెలవచ్చిన శాస్త్రి అభిప్రాయపడ్డాడు.

"ఎవరైనా సరే గట్టిగా పోటీ పడాల్సిందే. అయితే కొన్నిసార్లు లక్ కూడా కలిసి రావాలి. మనం మంచి క్రికెట్ ఆడలేదని నేను చెప్పను. మనవాళ్లు చాలా మంచి క్రికెట్ ఆడారు. అయితే కొన్నిసార్లు లక్ కలిసిరాలేదు. ఈ టీమ్ కు ఐసీసీ ట్రోఫీ గెలిచే సత్తా ఉందని నేనెప్పుడూ చెబుతూ ఉంటాను. నేను కోచ్ గా ఉన్నప్పుడు కూడా ఇదే విషయం చెబుతుండేవాడిని. ముఖ్యంగా గత మూడు, నాలుగేళ్లలో ఈ జట్టుకు ఐసీసీ ట్రోఫీ గెలిచే సత్తా ఉందని నేను నమ్ముతున్నాను. ఆ ప్లేయర్స్ ఇప్పటికీ ఉన్నారు" అని రవిశాస్త్రి అన్నాడు.

ఇక ఆస్ట్రేలియా విజయావకాశాలపైనా అతడు స్పందించాడు. "ప్రతి ఒక్కరూ ఆస్ట్రేలియానే ఫేవరెట్స్ అంటున్నారు. ఎందుకంటే ఈ ఫైనల్ ఇంగ్లండ్ లో ఆడుతున్నారు కాబట్టి. కానీ ఇది ఒకే ఒక టెస్ట్ మ్యాచ్. ఒక్క రోజు మీది కాకపోయినా మ్యాచ్ చేజారిపోవచ్చు. అందువల్ల ఆస్ట్రేలియా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి" అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు.

చివరిసారి 2013లో ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా.. అప్పటి నుంచీ వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్స్, సెమీఫైనల్స్ లలో బోల్తా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఐసీసీ ట్రోఫీ గెలిచేందుకు మరో అవకాశం ఇండియన్ టీమ్ కు వచ్చింది. మరి ఈసారి ఏం చేస్తారో చూడాలి.

తదుపరి వ్యాసం