తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wtc Final: టెస్టు చాంపియన్‍షిప్‍ ఫైనల్‍కు కామెంటేటర్లు వీళ్లే.. దాదాతో పాటు మరికొంత మంది దిగ్గజాలు..

WTC Final: టెస్టు చాంపియన్‍షిప్‍ ఫైనల్‍కు కామెంటేటర్లు వీళ్లే.. దాదాతో పాటు మరికొంత మంది దిగ్గజాలు..

03 June 2023, 8:57 IST

google News
    • WTC Final: ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్‍కు కామెంటేటర్ల లిస్ట్ వచ్చేసింది. ఈ మ్యాచ్‍కు కొందరు దిగ్గజాలు కామెంటరీ చేయనున్నారు.
WTC Final: టెస్టు చాంపియన్‍షిప్‍ ఫైనల్‍కు కామెంటేటర్లు వీళ్లే (HT Photo) (Getty)
WTC Final: టెస్టు చాంపియన్‍షిప్‍ ఫైనల్‍కు కామెంటేటర్లు వీళ్లే (HT Photo) (Getty)

WTC Final: టెస్టు చాంపియన్‍షిప్‍ ఫైనల్‍కు కామెంటేటర్లు వీళ్లే (HT Photo) (Getty)

WTC Final: ఈ ఏడాది ఐపీఎల్‍ టైటిల్‍ను మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్‍ (WTC) ఫైనల్‍పై ఉంది. మూడు నెలల విరామం తర్వాత టీమ్ఇండియా బరిలోకి దిగబోతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్‍లో టైటిల్ కోసం ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది రోహిత్‍సేన. జూన్ 7వ తేదీ నుంచి ఇంగ్లండ్‍లోని ఓవల్ వేదికగా ఈ ఫైనల్ ఫైట్ జరగనుంది. ఐపీఎల్ కారణంగా భారత ఆటగాళ్లు లండన్‍కు పలు బ్యాచ్‍లుగా వెళ్లారు. ఇప్పటికి అందరూ చేరుకున్నారు. ప్రధాన జట్టులోని ఆటగాళ్లందరూ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

టీమ్ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్‍కు అఫీషియల్ టీవీ, డిజిటల్ బ్రాడ్‍కాస్టర్లుగా స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్, డిస్నీ+హాట్‍స్టార్ ఉన్నాయి. తాజాగా ఈ తుదిపోరుకు కామెంటేటర్లుగా ఎవరు వ్యవహరించనున్నారో పూర్తి జాబితాను స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ వెల్లడించింది. సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, సౌరవ్ గంగూలీ, నాసీర్ హుస్సేన్, హర్భజన్ సింగ్ లాంటి దిగ్గజాలు కామెంటరీ చెప్పనున్నారు. ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ మొత్తంగా ఐదు భాషల్లో ఎవరెవరు కామెంటరీ చేయనున్నారో పూర్తి జాబితాను స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ వెల్లడించింది. ఆ లిస్ట్ ఇదే.

డబ్ల్యూటీసీ ఫైనల్‍లో ఐదు భాషలకు కామెంటేటర్లు వీళ్లే

ఇంగ్లిష్ (వరల్డ్ ఫీడ్): సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, మాథ్యూ హెడెన్, నాసీర్ హుసేన్

హిందీ: సౌరవ్ గంగూలీ, హర్భజన్ సింగ్, దీప్‍దాస్ గుప్తా, ఎస్.శ్రీశాంత్

తెలుగు: కౌశిక్ ఎన్‍సీ, ఆశిష్ రెడ్డి, టి.సుమన్, కల్యాణ్ కే

తమిళం: యో మహేశ్, ఎస్.రమేశ్, ఎల్.బాలాజీ, శ్రీరామ్

కన్నడ: విజయ్ భరద్వాజ్, శ్రీనివాస ఎం, బి.చిప్లీ, పవన్ దేశ్‍పాండే, సునీల్ జే

రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు.. ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ టైటిల్‍ కోసం ఆస్ట్రేలియాతో పోటీపడనుంది. కింగ్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‍లో ఉండడం భారత జట్టుకు సానుకూలంగా ఉంది. ఇక భారత స్పిన్నర్ అశ్విన్‍ను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా బ్యాటర్లు కసరత్తులు చేస్తున్నారు. జూన్ 7న ప్రారంభమయ్యే ఈ టెస్టు మహాసమరం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తదుపరి వ్యాసం