తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  French Open 2022 | 14వ సారి ఫైనల్‌లో నాదల్.. సెమీస్‌లో జ్వేరేవ్ రిటైర్డ్ హర్ట్

French Open 2022 | 14వ సారి ఫైనల్‌లో నాదల్.. సెమీస్‌లో జ్వేరేవ్ రిటైర్డ్ హర్ట్

03 June 2022, 22:50 IST

google News
    • స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరాడు. సెమీస్‌లో అనూహ్య రీతిలో జర్మన్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వేరేవ్ గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ కావడంతో నాదల్ డైరెక్టుగా ఫైనల్‌కు చేరాడు.
రఫెల్ నాదల్- అలెగ్డాండర్ జ్వేరేవ్
రఫెల్ నాదల్- అలెగ్డాండర్ జ్వేరేవ్ (AFP)

రఫెల్ నాదల్- అలెగ్డాండర్ జ్వేరేవ్

మట్టి కోర్టు రారాజు రఫెల్ నాదల్ మరోసారి ఫ్రెంచ్ ఓపెన్‌ ఫైనల్‌కు చేరాడు. కెరీర్‌లో 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ తుదిపోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం అలెగ్జాండర్ జ్వెరేవ్‌తో జరిగిన సెమీస్‌లో అనూహ్య రీతిలో నాదల్‌కు కలిసొచ్చింది. మూడో సీడ్ జ్వెరేవ్.. మధ్యలోనే గాయం కారణంగా కోర్టు వీడటంతో రఫా పైనల్‌కు చేరినట్లు ప్రకటించారు. రసవత్తరంగా సాగుతోన్న మ్యాచ్ మధ్యలో జర్మన్ క్రీడాకారుడికి చీలమండ నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.

అంతకు ముందు జ్వేరెవ్ 7-6(8), 6-6 తేడాతో ముందంజలో ఉన్నాడు. కానీ చీలమండ గాయం వేధించడంతో అదృష్టం రఫాకు కలిసొచ్చి ఫైనల్‌కు చేరాడు. ఫలితంగా మ్యాచ్ మూడు గంటల ముందే ముగిసింది. మొదటి సెట్ ట్రైబ్రేక్‌లో జ్వేరేవ్ నాలుగు సెట్ పాయింట్లను కోల్పోయాడు. రెండో సెట్‌లోని 12వ గేమ్‌లో చివరి పాయింట్‌ దక్కించుకునే సమయంలో కుడి చీలమండలో నొప్పి రావడంతో విలవిల్లాడి కోర్టులోనే పడిపోయాడు. ఎంత సేపటికి నొప్పి తగ్గకపోవడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.

శుక్రవారానికి 36 ఏళ్లు పూర్తి చేసుకున్న నాదల్.. పురుషుల సింగిల్స్ విభాగంలో 22వ గ్రాండ్‌స్లామ్‌ను అధిరోహించడానికి అడుగు దూరంలో ఉన్నాడు. క్రోయేషియాకు చెందిన మారిన్ సిలింక్, నార్వేకు చెందిన క్యాస్పెర్ రూడ్‌ మధ్య జరిగే సెమీస్‌లో గెలిచిన వారితో ఆదివారం నాడు ఫైనల్‌లో తలపడతాడు.

"ఇప్పుడు ఏం చెప్పాలో అర్ధం కావట్లేదు. చాలా కష్టంగా ఉంది. అతడు(అలెగ్డాండర్ జ్వేరేవ్) ఎవ్వరికీ నమ్మశక్యం కానీ రీతిలో ఆడాడు. నాకు మంచి సహచరుడు. గ్రాండ్‌స్లామ్ కోసం ఎంతగా పోరాడుతున్నాడో నాకు అర్థమైంది. ఇది చాలా కఠినమైన మ్యాచ్. మూడు గంటలకు పైగా సాగే ఈ మ్యాచ్‌లో మేము రెండు సెట్‌లు కూడా పూర్తి చేయలేదు. రోలాండ్ గారోస్‌లో ఫైనల్ చేరడం నా కల. కానీ ఈ విధంగా ముగించడం కొంచెం కష్టంగా ఉంది. జ్వేరేవ్ ఏడవడాన్ని చూసి మనస్సుకు చాలా కష్టంగా అనిపించింది." అని నాదల్ మ్యాచ్ అనంతరం తెలిపాడు.

<p>గాయంతో కిందపడిపోయిన జ్వేరేవ్</p>

టాపిక్

తదుపరి వ్యాసం