తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rafel Nadal | ఫ్రెంచ్ ఓపెన్‌లో రఫా విజృంభణ.. జకోపై అదిరిపోయే విజయం

Rafel Nadal | ఫ్రెంచ్ ఓపెన్‌లో రఫా విజృంభణ.. జకోపై అదిరిపోయే విజయం

01 June 2022, 8:04 IST

google News
    • ఫ్రెంచ్ ఓపెన్‌లో రఫెల్ నాదల్ అదరగొట్టాడు. చిరకాల ప్రత్యర్థి జకోతో జరగిన క్వార్టర్స్‌లో విజయం సాధించి సెమీస్‌కు చేరాడు. అలెగ్జాండర్ జ్వెరేవ్‌తో శుక్రవారం జరగనున్న సెమీస్‌లో తలపడనున్నాడు.
రఫెల్ నాదల్
రఫెల్ నాదల్ (AFP)

రఫెల్ నాదల్

మట్టి కోర్టు రారాజుగా గుర్తింపు పొందిన రఫెల్ నాదల్‌ మరోసారి తన విజృంభణతో రెచ్చిపోయాడు. అదిరిపోయే రీతిలో 13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఈ స్పెయిన్ బుల్.. ధాటికి ఎంతటి మహమాహులైన తల ఒంచాల్సిందే. ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్‌‌లోనూ మరోసారి టైటిల్ దిశగా దూసుకెళ్తున్నాడు. క్వార్టర్స్‌లో తన చిరకాల ప్రత్యర్థి నొవాక్ జకోవిచ్‌పై విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టాడు. మొత్తంగా 15వ సారి ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌కు చేరుకున్న రఫా.. 13 సార్లు టైటిల్ గెలవడం విశేషం.

ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్‌లో జకోపై 6-2, 4-6, 6-2, 7-6 తేడాతో ఓడించి సెమీస్ చేరాడు రఫా. నాలుగు సెట్ల పోరులో జకోపై అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు. తొలి సెట్‌లో సునాయసంగా విజయం సాధించిన నాదల్.. రెండో సెట్‌లో ప్రత్యర్థి విజృంభించాడు. ఫలితంగా ఆ సెట్‌లో ఓడిపోయాడు. తర్వాత మూడో సెట్‌లో 6-2 తేడాతో విజయం సాధించి గెలుపు అంచున నిలిచాడు. ఇక నాలుగో సెట్‌లో ఇరువురు మధ్య హోరాహోరి పోటీ జరిగింది. అయితే నాదల్ ధాటికి జకో తలవంచక తప్పలేదు. 7-6 తేడాతో రఫా విజయం సాధించాడు.

గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచిన జకోతో జరిగిన 10 మ్యాచ్‌ల్లో 8వ విజయాన్ని అందుకున్నాడు. శుక్రవారం నాడు మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరేవ్‌తో జరగనున్న సెమీస్‌లో తలపడనున్నాడు. ఆదివారం జరగనున్న ఫైనల్‌లో చోటు దక్కాలంటే జ్వెరేవ్‌పై నాదల్ విజయం సాధించాల్సి ఉంటుంది.

ఇప్పటి వరకు 13 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలిచిన నాదల్.. అత్యధిక ఫ్రెంచ్ సార్లు ఆ టైటిల్ గెల్చుకున్న ఆటగాడిగా రికార్డు సాధించాడు. కేవలం మూడు సార్లు మాత్రమే ఓటమి పాలయ్యాడు. గతేడాది సెమీస్‌లో జకోవిచ్ చేతిలో నాలుగు సెట్లలో నాదల్ పరాజయం చెందాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను నాదల్ కైవసం చేసుకున్నాడు.

 

టాపిక్

తదుపరి వ్యాసం