తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Hardik Pandya Comeback Tweet: హార్దిక్‌పై పాక్ మాజీ ప్రశంసలు.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్

Hardik Pandya Comeback Tweet: హార్దిక్‌పై పాక్ మాజీ ప్రశంసలు.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్

31 August 2022, 6:34 IST

google News
    • Pakistan Bowler reply to Hardik Pandya tweet: హార్దిక్ పాండ్య చేసిన కమ్ బ్యాక్ ట్వీట్‌పై పాక్ మాజీ బౌలర్ మహమ్మద్ అమీర్ స్పందించాడు. ప్రస్తుత ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా అతడిపై విశేషంగా స్పందిస్తున్నారు.
2018 ఆసియా కప్ మ్యాచ్‌లో స్ట్రెచర్‌పై పాండ్య
2018 ఆసియా కప్ మ్యాచ్‌లో స్ట్రెచర్‌పై పాండ్య (Twitter)

2018 ఆసియా కప్ మ్యాచ్‌లో స్ట్రెచర్‌పై పాండ్య

Pakistan Bowler reply to Hardik Pandya tweet: భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఆ ఉత్కంఠ, క్రేజ్ మరోలా ఉంటుంది. ఇటీవలే ఆసియా కప్ 2022లో భాగంగా ఇరు జట్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా అదిరిపోయే విజయాన్ని కైవసం చేసుకుంది. పాక్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌లో 3 వికెట్లతో అదరగొట్టిన హార్దిక్ పాండ్య.. బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా అతడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. నాలుగేళ్ల క్రితం ఆసియా కప్‌లోనే ఇదే జట్టుపై గాయంతో స్ట్రెచర్‌పై మైదానం వీడిన పాండ్య.. మళ్లీ ఇదే టోర్నీలో, ఇదే జట్టుపై మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. నాటి పరిస్థితికి సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశాడు.

"ఎదురుదెబ్బ తినడం కంటే దాన్ని ఎదుర్కొని పునరాగమనం చేయడం గొప్ప విషయం" అంటూ హార్దిక్ పాండ్య ట్విటర్ వేదికగా మ్యాచ్ అనంతరం స్పందించాడు. ఈ పోస్టుకు స్ట్రెచర్‌పై వెళ్తున్న ఫొటోతో పాటు తాజా మ్యాచ్‌లో తన ఫొటోను జత చేశాడు. ఈ ట్వీట్‌పై సామాజిక మాధ్యమంలో విశేష స్పందన లభించింది.

తాజాగా ఈ పోస్టుపై పాకిస్థాన్ మాజీ బౌలర్ మహ్మద్ అమీర్ స్పందించాడు. "బాగా ఆడావ్ బ్రదర్" అంటూ ట్విటర్ వేదికగా హార్దిక్ పాండ్యాకు అభినందనలు తెలిపాడు. ప్రస్తుతం అమీర్ చేసిన ఈ రిప్లయి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 147 పరుగులకు ఆలౌటైంది. దాయాది జట్టులో మహ్మద్ రిజ్వాన్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భువనేశ్వర్ 4 వికెట్లు, హార్దిక్ 3 వికెట్లతో ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనంలో టీమిండియా 19.4 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది. కోహ్లీ 35 పరుగులు చేయగా.. జడేజా 35, పాండ్య 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

తదుపరి వ్యాసం