తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Neeraj Chopra: గోల్డ్ మెడల్ వైపు తొలి అడుగు వేసిన నీరజ్ చోప్రా.. ఒలింపిక్స్‌లో బెస్ట్ త్రోతో ఫైనల్లోకి..

Neeraj Chopra: గోల్డ్ మెడల్ వైపు తొలి అడుగు వేసిన నీరజ్ చోప్రా.. ఒలింపిక్స్‌లో బెస్ట్ త్రోతో ఫైనల్లోకి..

Hari Prasad S HT Telugu

06 August 2024, 15:53 IST

google News
    • Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్ లోనూ గోల్డ్ మెడల్ వైపు మరో అడుగు వేశాడు నీరజ్ చోప్రా. మంగళవారం (ఆగస్ట్ 6) జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో తొలి ప్రయత్నంలోనే తన సీజన్, ఒలింపిక్స్ బెస్ట్ త్రోతో ఫైనల్లోకి వెళ్లాడు.
గోల్డ్ మెడల్ వైపు తొలి అడుగు వేసిన నీరజ్ చోప్రా.. ఒలింపిక్స్‌లో బెస్ట్ త్రోతో ఫైనల్లోకి..
గోల్డ్ మెడల్ వైపు తొలి అడుగు వేసిన నీరజ్ చోప్రా.. ఒలింపిక్స్‌లో బెస్ట్ త్రోతో ఫైనల్లోకి..

గోల్డ్ మెడల్ వైపు తొలి అడుగు వేసిన నీరజ్ చోప్రా.. ఒలింపిక్స్‌లో బెస్ట్ త్రోతో ఫైనల్లోకి..

Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత జావెలియన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ లోనూ ఆ దిశగా తొలి అడుగు వేశాడు. క్వాలిఫికేషన్ రౌండ్లోనే రికార్డు త్రోతో అతడు తొలి ప్రయత్నంలోనే ఫైనల్ కు అర్హత సాధించాడు. మెడల్స్ కోసం ఫైనల్ గురువారం (ఆగస్ట్ 8) జరగనుంది. ఆ రోజు రాత్రి 11.55 గంటల నుంచి ఈ ఈవెంట్ ప్రారంభం అవుతుంది.

నీరజ్ చోప్రా రికార్డు

భారీ అంచనాల మధ్య పారిస్ ఒలింపిక్స్ బరిలోకి దిగిన నీరజ్ చోప్రా తాను వేసిన తొలి త్రోతోనే గోల్డ్ మెడల్ గురించి తాను ఎంత సిద్ధంగా ఉన్నాడో నిరూపించాడు. క్వాలిఫికేషన్ రౌండ్ తొలి ప్రయత్నంలోనే నీరజ్ ఏకంగా 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్ కు అర్హత సాధించాడు. ఫైనల్ వెళ్లాలంటే 84 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసరాల్సి ఉండగా.. నీరజ్ చాలా సులువుగా ఆ మార్క్ దాటేశాడు.

నీరజ్ చోప్రాకు ఇది సీజన్ బెస్ట్ కావడం విశేషం. అంతేకాదు ఒలింపిక్స్ లోనూ అతనికి ఇదే అత్యుత్తమ త్రో. టోక్యోలో నీరజ్ గోల్డ్ మెడల్ సాధించినా.. అక్కడ అతడు విసిరిన దూరం 87.58 మీటర్ల దూరం మాత్రమే విసిరాడు. కానీ ఈసారి క్వాలిఫికేషన్ రౌండ్ తొలి ప్రయత్నంలోనే ఏకంగా 89.34 మీటర్లతో తాను ఫైనల్లో ఏం చేయబోతున్నాడో చెప్పకనే చెప్పాడు.

అంతేకాదు 90 మీటర్ల లక్ష్యాన్ని అతడు ఫైనల్లో అందుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రూప్ బిలో నీరజ్ టాప్ లో నిలిచాడు. ఇక రెండో స్థానంలో ఆండర్సన్ పీటర్స్ నిలిచాడు. అతడు 88.63 మీటర్ల దూరం విసిరి తొలి ప్రయత్నంలోనే ఫైనల్ కు అర్హత సాధించాడు. ఇక ఇదే గ్రూపులో పాకిస్థాన్ స్టార్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ కూడా తొలి ప్రయత్నంలోనే 86.59 మీటర్ల దూరం విసిరి ఫైనల్ చేరాడు.

మరో ఇండియన్ జావెలిన్ త్రోయర్ కిశోర్ జేనా మాత్రం ఫైనల్ చేరలేకపోయాడు. అతడు మూడు ప్రయత్నాల్లో అత్యుత్తమంగా 80.73 మీటర్ల దూరం మాత్రమే విసిరాడు. దీంతో టాప్ 12లో అతనికి స్థానం దక్కలేదు.

తదుపరి వ్యాసం