Lakshya Sen : లక్ష్యసేన్‍కు నిరాశ.. ఒలింపిక్స్ సెమీస్‍లో ఓటమి.. అయినా పతకం ఆశలు ఇంకా సజీవం
- Paris Olympics 2024 - Lakshya Sen: భారత యంగ్ బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్‍కు పారిస్ ఒలింపిక్స్ 2024లో ఎదురుదెబ్బ తలిగింది. సెమీఫైనల్‍లో అతడు ఓటమి పాలయ్యాడు. అయితే, అతడికి కాంస్య పతకం సాధించే అవకాశం ఉంది.
- Paris Olympics 2024 - Lakshya Sen: భారత యంగ్ బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్‍కు పారిస్ ఒలింపిక్స్ 2024లో ఎదురుదెబ్బ తలిగింది. సెమీఫైనల్‍లో అతడు ఓటమి పాలయ్యాడు. అయితే, అతడికి కాంస్య పతకం సాధించే అవకాశం ఉంది.
(1 / 5)
పారిస్ ఒలింపిక్స్ 2024లో సత్తాచాటి సెమీ ఫైనల్ వరకు దూసుకొచ్చాడు భారత యంగ్ బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్. అయితే, నేడు (ఆగస్టు 4) జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‍లో డెన్మార్క్ స్టార్ ప్లేయర్ విక్టర్ అక్సెల్‍సన్ చేతిలో లక్ష్య ఓడిపోయాడు.
(AP)(2 / 5)
ఈ సెమీస్‍లో 20-22,14-21 తేడాతో వరుస సెట్లలో ఒలింపిక్ డిఫెండింగ్ చాంపియన్ అక్సెల్‍సన్‍పై 22 ఏళ్ల లక్ష్యసేన్ పరాజయం చెందాడు. ధీటుగా పోటీ ఇచ్చినా.. చివరికి వరస సెట్లలోనే ఓటమి ఎదురైంది.
(PTI)(3 / 5)
ఈ మ్యాచ్‍లో రెండు గేమ్‍ల్లోనూ ముందుగా ఆధిక్యం ప్రదర్శించాడు. తొలి గేమ్‍లో ఓ దశలో 11-9తో ముందుకు వెళ్లాడు. లక్ష్య, అక్సెల్‍సన్ హోరాహోరీగా పోరాడారు. అయితే, చివరికి 22-20తో గేమ్ గెలిచాడు డెన్మార్క్ ప్లేయర్.
(AFP)(4 / 5)
రెండో గేమ్‍లో లక్ష్యసేన్ ఆరంభంలో చెలరేగాడు. 7-0తో దుమ్మురేపాడు. అయితే, ఆ తర్వాత అక్సెల్‍సన్ అద్భుతంగా పుంజుకున్నాడు. 10-10తో సమం చేశాడు. ఆ తర్వాత ఆధిక్యంలోకి వెళ్లి ఈ గేమ్‍ను కూడా కైవసం చేసుకున్నాడు. దీంతో లక్ష్యకు ఓటమి ఎదురైంది.
(REUTERS)ఇతర గ్యాలరీలు