తెలుగు న్యూస్ / ఫోటో /
India at Olympics: ఒలింపిక్స్‌లో ఇండియా.. హాకీ వరుస గోల్డ్ మెడల్స్ నుంచి నీరజ్ చోప్రా వరకు.. ఫొటోల్లో..
- India at Olympics: పారిస్ ఒలింపిక్స్ కు టైమ్ దగ్గర పడుతున్న సమయంలో ఈ విశ్వ క్రీడల్లో ఇండియా సాధించిన గొప్ప విజయాలను ఓసారి గుర్తు చేసుకుందాం. హాకీలో వరుస గోల్డ్ మెడల్స్ నుంచి నీరజ్ చోప్రా సృష్టించిన చరిత్ర వరకు ఫొటోల్లో చూడండి.
- India at Olympics: పారిస్ ఒలింపిక్స్ కు టైమ్ దగ్గర పడుతున్న సమయంలో ఈ విశ్వ క్రీడల్లో ఇండియా సాధించిన గొప్ప విజయాలను ఓసారి గుర్తు చేసుకుందాం. హాకీలో వరుస గోల్డ్ మెడల్స్ నుంచి నీరజ్ చోప్రా సృష్టించిన చరిత్ర వరకు ఫొటోల్లో చూడండి.
(1 / 11)
India at Olympics: ఇండియా 1920లో తొలిసారి అధికారికంగా సమ్మర్ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసింది. ఇక 1948లో స్వతంత్ర దేశంగా పాల్గొంది. ఇప్పటి వరకూ మొత్తంగా 35 మెడల్స్ సాధించింది. అందులో 10 గోల్డ్ మెడల్స్, 9 సిల్వర్, 16 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. 2008, 2013, 2016, 2020 ఒలింపిక్స్ లోనే ఇండియా ఎక్కువ మెడల్స్ సాధించింది. అయితే పది గోల్డ్ మెడల్స్ లో 8 కేవలం ఇండియన మెన్స్ హాకీ తీసుకొచ్చింది. 1928 నుంచి 1980 మధ్య ఈ మెడల్స్ వచ్చాయి.(Getty Images)
(2 / 11)
India at Olympics: ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ సక్సెస్ స్టోరీయే ఒలింపిక్స్ లో భారత్ సాధించిన అతిపెద్ద ఘనత అని చెప్పొచ్చు. తొలిసారి 1928లో గోల్డ్ మెడల్ గెలిచింది. ధ్యాన్ చంద్ గెలిచిన మూడు గోల్డ్ మెడల్స్ లో తొలి గోల్డ్ కూడా ఇదే. అప్పుడు మొదలైన ఇండియన్ హాకీ టీమ్ విజయాల పరంపర 1956 వరకు సాగింది. 1960 ఒలింపిక్స్ ఫైనల్లో పాకిస్థాన్ చేతుల్లో ఓడింది. 1952 వరకు కేవలం హాకీలోనే ఇండియాకు మెడల్స్ రాగా.. ఆ ఏడాది రెజ్లర్ కేడీ జాదవ్ తొలిసారి ఓ వ్యక్తిగత పతకం సాధించాడు. అతనికి బ్రాంజ్ మెడల్ వచ్చింది. హాకీలో ఇండియా 1928, 1932, 1936, 1948, 1952, 1956, 1964, 1980లలో గోల్డ్ మెడల్స్ గెలిచింది. ఆ తర్వాత 2021లోనే మళ్లీ హాకీలో ఇండియాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది.(Getty Images)
(3 / 11)
India at Olympics: 1960 ఒలింపిక్స్ లో మెన్స్ 400 మీటర్ల రేసులో మిల్కా సింగ్ తృటిలో బ్రాంజ్ మెడల్ కోల్పోయాడు. లేదంటే ఇండియాకు అదే ట్రాక్ అండ్ ఫీల్డ్ లో తొలి మెడల్ అయ్యేది. కానీ అతడు నాలుగో స్థానంలో నిలిచాడు.(Getty Images)
(4 / 11)
India at Olympics: 1980 ఒలింపిక్స్ తర్వాత హాకీలో మెడల్స్ ఆగిపోవడంతో 1984, 1988, 1992 ఒలింపిక్స్ లో ఇండియాకు ఒక్క మెడల్ కూడా రాలేదు. ఇక 1996లో లెజెండరీ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ మెడల్స్ కరువుకు తెరదించుతూ బ్రాంజ్ మెడల్ గెలిచాడు. అంగ్రీ అగాసీ చేతుల్లో సెమీఫైనల్లో ఓడి బ్రాంజ్ తో సరిపెట్టుకున్నాడు.(Getty Images)
(5 / 11)
India at Olympics: సిడ్నీలో 2000లో జరిగిన ఒలింపిక్స్ లో మన తెలుగు తేజం కరణం మల్లీశ్వరి చరిత్ర సృష్టించింది. ఆమె వెయిట్ లిఫ్టింగ్ లో బ్రాంజ్ మెడల్ గెలిచి ఒలింపిక్ మెడల్ సాధించిన తొలి మహిళగా నిలిచింది. మల్లీశ్వరి 69 కేజీల కేటగిరీలో ఆమె స్నాచ్ లో 110 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ లో 130 కిలోలు ఎత్తి బ్రాంజ్ మెడల్ గెలిచింది.(Getty Images )
(6 / 11)
India at Olympics: బీజింగ్ లో 2008లో జరిగిన ఒలింపిక్స్ లో ఇండియా తరఫున వ్యక్తిగత గోల్డ్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు షూటర్ అభినవ్ బింద్రా. ఆ ఒలింపిక్స్ తర్వాత క్రమంగా ప్రతి గేమ్స్ లో ఇండియా మెడల్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది.(Getty Images)
(7 / 11)
India at Olympics: ఇక అదే బీజింగ్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ బ్రాంజ్ మెడల్స్ గెలిచారు. ఆ తర్వాత లండన్ ఒలింపిక్స్ లోనూ సుశీల్ సిల్వర్ మెడల్ గెలిచి వరుస గేమ్స్ లో మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్ అథ్లెట్ గా నిలిచాడు.(AFP)
(8 / 11)
India at Olympics: 2012లో లండన్ లో జరిగిన ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ లో మెడల్ గెలిచిన తొలి ఇండియన్ ప్లేయర్ గా సైనా నెహ్వాల్ నిలిచింది. ఆ గేమ్స్ లో ఆమెకు బ్రాంజ్ మెడల్ దక్కింది.(Getty Images)
(9 / 11)
India at Olympics: ఆ తర్వాత 2016 రియో ఒలింపిక్స్ లో సైనాను మించి పీవీ సింధు సిల్వర్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ లోనూ సింధు బ్రాంజ్ మెడల్ గెలిచింది. వరుస ఒలింపిక్స్ లో మెడల్ గెలిచిన తొలి ఇండియన్ వుమన్ ప్లేయర్ గా ఆమె నిలిచింది.(Getty Images)
(10 / 11)
India at Olympics: 40 ఏళ్ల తర్వాత హాకీలో మరో మెడల్ అందించింది టోక్యో ఒలింపిక్స్. మెన్స్ హాకీ టీమ్ బ్రాంజ్ మెడల్ గెలిచింది. (Hockey India)
ఇతర గ్యాలరీలు