తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Vinesh Phogat: రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పిన వినేష్ ఫోగ‌ట్ - పోరాడే శ‌క్తి లేదంటూ ట్వీట్

Vinesh Phogat: రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పిన వినేష్ ఫోగ‌ట్ - పోరాడే శ‌క్తి లేదంటూ ట్వీట్

08 August 2024, 8:31 IST

google News
  • Vinesh Phogat: ఒలింపిక్స్ నుంచి అన‌ర్హ‌తకు గురైన వినేష్ ఫోగ‌ట్ రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పింది. త‌న‌కు పోరాడే శ‌క్తి లేదంటూ ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వినేష్ ఫొగ‌ట్
వినేష్ ఫొగ‌ట్

వినేష్ ఫొగ‌ట్

Vinesh Phogat: భార‌త రెజ్ల‌ర్ వినేష్ ఫోగ‌ట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. త‌న‌పై అన‌ర్హ‌త వేటు ప‌డిన త‌ర్వాతే రోజు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టిస్తూ అభిమానుల‌ను షాకిచ్చింది. ఈ మేర‌కు వినేష్ ఫోగ‌ట్ ఓ ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నాపై రెజ్లింగ్ గెలిచింది. నేను ఓడిపోయాను.

ఇక నాకు పోరాడే శ‌క్తి లేదు. గుడ్ బై రెజ్లింగ్ 2001 - 2024 అంటూ వినేష్ ఫోగ‌ట్ ఈ ట్వీట్‌లో పేర్కొన్న‌ది. అభిమానుల‌ను ఉద్దేశిస్తూ ప‌త‌కానికి దూర‌మై మీ క‌ల‌ల‌ను చెరిపివేశాను.నా ధైర్యం చ‌చ్చిపోయింది. న‌న్ను క్ష‌మించండి అంటూ ట్వీట్‌లో పేర్కొన్న‌ది. ఈ పోరాటంలో నాకు అండ‌గా నిలిచిన ప్ర‌తి ఒక్క‌రికి రుణ‌ప‌డి ఉంటాన‌ని వినేష్ ఫోగ‌ట్ ట్వీట్‌లో తెలిపింది. ఆమెకు క్రీడాభిమానులు మ‌ద్ధుతుగా నిలుస్తోన్నారు. రిటైర్‌మెంట్‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ట్వీట్స్ చేస్తోన్నారు.

ఫైన‌ల్ చేరి...

పారిస్ ఒలింపిక్స్‌లో యాభై కేజీల విభాగంలో ఫైన‌ల్ చేరి చ‌రిత్ర‌ను సృష్టించింది వినేష్ ఫోగ‌ట్. ఈ ఘ‌న‌త‌ను సాధించిన తొలి రెజ్ల‌ర్‌గా నిలిచింది. అయితే యాభై కేజీల కంటే 150 గ్రాముల బ‌రువు ఎక్కువ‌గా ఉండ‌టంతో ఆమెపై అన‌ర్హ‌త వేటు ప‌డింది. త‌న అన‌ర్హ‌త వేటుపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేష‌న్ ఫ‌ర్ స్పోర్ట్స్‌కు వినేష్ స‌వాల్ చేసిన‌ట్లు స‌మాచారం. త‌న‌కు సిల్వ‌ర్ మెడ‌ల్ అయినా ఇవ్వాల‌ని ఆమె పిటిష‌న్‌లో పేర్కొన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి.

తొలి రెజ్ల‌ర్‌గా...

అన‌ర్హ‌త నుంచి త‌ప్పించుకోవ‌డానికి బరువు తగ్గేందుకు తిండి మానేసి, స్కిప్పింగ్, జాగింగ్, సైక్లింగ్ లాంటివి చేయడంతో ఢీ హైడ్రేష‌న్‌కు గురైన వినేష్ ఫోగ‌ట్ క‌ళ్లు తిరిగి ప‌డిపోయింది. దాంతో

ఒలింపిక్స్ విలేజ్ లోనే వినేశ్ కు చికిత్స అందించారు. ప్ర‌స్తుతం ఆమె కోలుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఒలింపిక్స్ లో ఇలా ఫైనల్ కు ముందు అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన తొలి రెజ్లర్ గా వినేష్ ఫోగ‌ట్నిలిచింది.

రాష్ట్ర‌ప‌తి, మోదీతో పాటు...

ఒలింపిక్స్ నుంచి అన‌ర్హ‌త‌కు గురైన వినేష్ ఫోగ‌ట్ కు ప్ర‌ముఖులు మ‌ద్ధుతుగా నిలుస్తోన్నారు. రాష్ట్ర‌ప‌తి, పీఎం నరేంద్ర మోదీ ప‌లువురు రాజ‌కీయ‌, క్రీడాప్ర‌ముఖులు వినేష్ ఫొగ‌ట్ ధైర్యాన్ని నింపుతూ ట్వీట్స్ చేస్తోన్నారు. వినేశ్.. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్. ఇండియాకు గర్వకారణం. ప్రతి భారతీయుడికీ స్ఫూర్తి అంటూ మోదీ ట్వీట్ చేశారు.

వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ ఛాంపియ‌న్‌షిప్‌లో...

వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ ఛాంపియ‌న్‌షిప్‌లో రెండు బ్రాంజ్ మెడ‌ల్స్ గెలుచుకున్న‌ది వినేష్ ఫోగ‌ట్. ఆసియా, కామ‌న్‌వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడ‌ల్స్ సాధించింది.

తదుపరి వ్యాసం