తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Lionel Messi Instagram Record: ఇన్‌స్టాగ్రామ్‌లో మెస్సీ రికార్డు.. రొనాల్డోనే మించిపోయాడు

Lionel Messi Instagram Record: ఇన్‌స్టాగ్రామ్‌లో మెస్సీ రికార్డు.. రొనాల్డోనే మించిపోయాడు

Hari Prasad S HT Telugu

20 December 2022, 17:19 IST

google News
    • Lionel Messi Instagram Record: ఇన్‌స్టాగ్రామ్‌లో మెస్సీ రికార్డు సృష్టించాడు. వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత మెస్సీ చేసిన ఓ పోస్ట్‌తో ఆల్‌టైమ్‌ గ్రేట్స్‌లో ఒకడైన క్రిస్టియానో రొనాల్డోనే మించిపోయాడు.
ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీతో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ
ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీతో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ (Selección Argentina Twitter)

ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీతో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ

Lionel Messi Instagram Record: అర్జెంటీనా కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు. వరల్డ్‌కప్‌ గెలవాలన్న తన కల మొత్తానికి నిజమైంది. ఫిఫా వరల్డ్‌కప్‌ 2022 ఫైనల్లో ఫ్రాన్స్‌ను పెనాల్టీల్లో 4-2తో ఓడించిన అర్జెంటీనా.. విశ్వవిజేతగా నిలిచింది. తన టీమ్‌ను విజేతగా నిలిపిన మెస్సీ గోల్డెన్‌ బాల్‌ అవార్డు గెలుచుకున్నాడు.

రెండుసార్లు గోల్డెన్‌ బాల్‌ గెలుచుకున్న తొలి ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు. ఫీల్డ్‌లో రికార్డులే కాదు.. ఇప్పుడు సోషల్‌ మీడియాలోనూ అతడు సరికొత్త రికార్డు సృష్టించాడు. వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత మెస్సీ చేసిన పోస్ట్‌ను ఇప్పటికే సుమారు 6 కోట్ల మంది లైక్‌ చేయడం విశేషం. ఓ స్పోర్ట్స్‌ పర్సన్‌ చేసిన పోస్ట్‌కు ఇవే రికార్డు లైక్స్‌. ఛాంపియన్స్‌ ఆఫ్ ద వరల్డ్‌ అంటూ మెస్సీ చేసిన ఈ పోస్ట్‌ను ఇప్పటి వరకూ 6 కోట్ల వరకూ లైక్స్‌, 17 లక్షల వరకూ కామెంట్స్‌ వచ్చాయి.

"ఎన్నోసార్లు నేను దీని గురించి కల కన్నాను. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబానికి కృతజ్ఞతలు. అర్జెంటీనియన్లు ఏకమై, పోరాడినప్పుడు అనుకున్నది సాధిస్తారని మరోసారి నిరూపించాం. వ్యక్తుల కంటే టీమ్‌ గొప్ప" అని మెస్సీ ఆ పోస్ట్‌లో రాశాడు. ఈ పోస్ట్‌ గంటల్లోనే వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా అర్జెంటీనా అభిమానులు లైక్‌ చేయడం మొదలుపెట్టారు.

ఆ వెంటనే ఓ స్పోర్ట్స్‌ పర్సన్‌ పోస్ట్‌కు అత్యధిక లైక్స్‌ వచ్చిన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ ఈ రికార్డు పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో పేరిట ఉండేది. మెస్సీతో కలిసి చెస్‌ ఆడుతున్న ఫొటోను రొనాల్డో షేర్‌ చేశాడు. ఆ ఫొటోకు 4.19 కోట్ల లైక్స్‌ వచ్చాయి. ఆ రికార్డును ఎప్పుడో దాటేసిన మెస్సీ పోస్ట్‌.. ఇంకా దూసుకెళ్తూనే ఉంది.

ఇక ఫిఫా వరల్డ్‌ కప్‌ ట్రోఫీ ప్రజెంటేషన్‌ కూడా సోషల్‌ మీడియాలో మోస్ట్‌ ట్రెండింగ్‌ టాపిక్‌గా నిలిచింది. మెస్సీ ఎన్నో ఏళ్ల కల నెరవేరినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆనందంగా ఉన్నారు.

తదుపరి వ్యాసం