Prize money for FIFA World Cup winner: ఫిఫా వరల్డ్‌కప్ 2022 విజేతకు భారీ ప్రైజ్‌మనీ
Prize money for FIFA World Cup winner: ఫిఫా వరల్డ్‌కప్ 2022 విజేతకు భారీ ప్రైజ్‌మనీ దక్కనుంది. ఈ మెగా టోర్నీ విజేతతోపాటు రన్నరప్ అందుకునే ప్రైజ్‌మనీ వివరాలను తాజాగా ఫిఫా వెల్లడించింది.
Prize money for FIFA World Cup winner: ఫుట్‌బాల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఆ క్రేజ్‌కు తగినట్లే ఫుట్‌బాల్ ప్లేయర్స్ సంపాదన కూడా ఉంటుంది. బయటి సంపాదన పక్కన పెడితే.. టోర్నీల్లో ఆడినందుకే ప్రైజ్‌మనీగా భారీ మొత్తం అందుకుంటారు. తాజాగా వరల్డ్ కప్ 2022లోనూ విజేతకు ఫిఫా భారీ ప్రైజ్‌మనీ ప్రకటించింది.
వచ్చే ఆదివారం (డిసెంబర్ 18న) అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య పైనల్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ రెండు టీమ్స్ గతలో రెండేసి సార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. 1978, 1986లలో అర్జెంటీనా, 1998, 2018లలో ఫ్రాన్స్ విశ్వవిజేతలయ్యాయి. ముచ్చటగా మూడోసారి టైటిల్‌పై కన్నేసిన ఈ రెండు టీమ్స్‌లో ఈసారి విజేతగా నిలిచే జట్టు ఏకంగా 4.2 కోట్ల డాలర్లు (సుమారు రూ.347 కోట్లు) ప్రైజ్‌మనీగా అందుకోనుంది.
ఇక రన్నరప్‌గా నిలిచే టీమ్‌కు 3 కోట్ల డాలర్లు (సుమారు రూ. 246 కోట్లు) దక్కనున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక మంది చూసే ఈ ఆటలో వరల్డ్‌కప్పే అత్యుత్తమమైన టోర్నీ. దీంతో అందుకు తగినట్లే ప్రైజ్ మనీ కూడా చాలా భారీగా ఉంటుంది. ఇక టోర్నీలో మూడోస్థానంలో నిలిచే టీమ్‌కు 2.7 కోట్ల డాలర్లు, నాలుగో స్థానంలో నిలిచే టీమ్‌కు 2.5 కోట్ల డాలర్లు ఇస్తారు.
ఈ మూడోస్థానం కోసం మ్యాచ్ శనివారం, ఫైనల్ ఆదివారం జరుగుతాయి. క్వార్టర్‌ఫైనల్లో ఇంటిదారి పట్టిన బ్రెజిల్, నెదర్లాండ్స్, పోర్చుగల్, ఇంగ్లండ్ టీమ్స్ ఒక్కో దానికి 1.7 కోట్ల డాలర్లు ప్రైజ్‌మనీగా ఇస్తారు. రౌండ్ ఆఫ్ 16లో ఓడిపోయిన యూఎస్‌ఏ, సెనెగల్, ఆస్ట్రేలియా, పోలాండ్, స్పెయిన్, జపాన్, స్విట్జర్లాండ్, సౌత్ కొరియాలకు 1.3 కోట్ల డాలర్లు దక్కుతాయి.
ఇక గ్రూప్ స్టేజ్‌లోనే టోర్నీ వదిలి వెళ్లిన ఖతార్, ఈక్వెడార్, వేల్స్, ఇరాన్, మెక్సికో, సౌదీ అరేబియా, డెన్మార్క్, ట్యునీషియా, కెనడా, బెల్జియం, జర్మనీ, కోస్టారికా, సెర్బియా, కామెరూన్, ఘనా, ఉరుగ్వే టీమ్స్ ఒక్కోదానికి 90 లక్షల డాలర్లు ఇస్తారు.