France vs Morocco Fifa World Cup: ఫైన‌ల్‌లో ఫ్రాన్స్ - సెమీస్‌లో మొరాకోపై ఘ‌న విజ‌యం-france beat morocco by 2 0 enter in to fifa world cup 2022 final ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  France Vs Morocco Fifa World Cup: ఫైన‌ల్‌లో ఫ్రాన్స్ - సెమీస్‌లో మొరాకోపై ఘ‌న విజ‌యం

France vs Morocco Fifa World Cup: ఫైన‌ల్‌లో ఫ్రాన్స్ - సెమీస్‌లో మొరాకోపై ఘ‌న విజ‌యం

Nelki Naresh Kumar HT Telugu
Dec 15, 2022 07:38 AM IST

France vs Morocco Fifa World Cup: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో వ‌రుస‌గా రెండోసారి ఫైన‌ల్ చేరుకొని ఫ్రాన్స్ చ‌రిత్ర‌ను సృష్టించింది. బుధవారం అర్ధ‌రాత్రి జ‌రిగిన సెమీఫైన‌ల్‌లో మొరాకోపై 2-0 తేడాతో ఫ్రాన్స్ విజ‌యాన్ని సాధించింది. అర్జెంటీనాతో ఫైన‌ల్ ఫైట్‌కు రెడీ అయ్యింది.

ఫ్రాన్స్ వ‌ర్సెస్ మొరాకో
ఫ్రాన్స్ వ‌ర్సెస్ మొరాకో

France vs Morocco Fifa World Cup: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో అర్జెంటీనాతో త‌ల‌ప‌డే జ‌ట్టు ఏద‌న్న‌ది తేలిపోయింది. ఫ్రాన్స్ ఫైన‌ల్ చేరుకున్న‌ది. బుధవారం అర్ధ‌రాత్రి జ‌రిగిన సెమీఫైన‌ల్‌లో మొరాకోపై 2-0 తేడాతో ఫ్రాన్స్ విజ‌యాన్ని సాధించి ఫైన‌ల్ బెర్తును ఖాయం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఫ్రాన్స్ జోరు ముందు మొరాకో పూర్తిగా తేలిపోయింది.

వ‌రుస‌గా రెండో సారి ఫ్రాన్స్ ఫైన‌ల్ చేరుకొని చ‌రిత్ర‌ను సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి ఫ్రాన్స్ ఆట‌గాళ్లు దూకుడును ప్ర‌ద‌ర్శించారు. ఐదో నిమిషంలో గ్రీజ్‌మ‌న్‌, ఎంబాపే ఇచ్చిన పాస్‌ను హెర్నాండేజ్ గోల్‌గా మ‌లిచాడు. ఈ స్కోరును స‌మం చేసేందుకు మొరాకో ఆట‌గాళ్లు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించారు. ప‌దో నిమిషంలో మొరాకో స్ట్రైక‌ర్ ఒన‌హి గోల్ కొట్టినంత ప‌నిచేశాడు. కానీ ఫ్రాన్స్ గోల్ కీప‌ర్ లోరిస్ చ‌క్క‌టి డైవ్‌తో బాల్‌ను అడ్డుకున్నాడు.

మొరాకో డిఫెన్స్‌ను ఛేదిస్తూ గ్రీజ్‌మ‌న్‌, గెరార్డ్ , ఎంబాపే గోల్ చేయ‌డానికి విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. చాలా సార్లు తృటిలో మిస్ అయ్యాయి. డెంబ‌లే స్థానంలో 78వ నిమిషంలో స‌బ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి అడుగుపెట్టిన ఫ్రాన్స్ స్ట్రైక‌ర్ కోలో మువాని మ‌రో గోల్ చేసి ఫ్రాన్స్ విజ‌యాన్ని ఖాయం చేశాడు. స‌బ్‌స్టిట్యూట్‌గా స్టేడియంలో అడుగుపెట్టిన 44 సెకండ్ల‌లోనే గోల్ చేశాడు మువాని. 2

018 వ‌ర‌ల్డ్ క‌ప్‌ విజేత‌గా నిలిచిన ఫ్రాన్స్ వ‌రుస‌గా రెండో సారి ఫైన‌ల్ చేరుకున్న‌ది. అర్జెంటీనాతో తుదిపోరుకు సిద్ధ‌మైంది. ఆదివారం ఫ్రాన్స్- అర్జెంటీనా మ‌ధ్య ఫైన‌ల్ జ‌రుగ‌నుంది.

WhatsApp channel