Messi Net Worth : మెస్సీ గంట సంపాదన ఎంతో తెలుసా? షాక్ అవ్వాల్సిందే..-lionel messi net worth and his luxury life style here s details ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Lionel Messi Net Worth And His Luxury Life Style Here's Details

Messi Net Worth : మెస్సీ గంట సంపాదన ఎంతో తెలుసా? షాక్ అవ్వాల్సిందే..

HT Telugu Desk HT Telugu
Dec 19, 2022 09:09 PM IST

Lionel Messi Net Worth : ఫుట్ బాల్ చరిత్రలో గుర్తుండిపోయే పేరు లియోనల్ మెస్సీ. మైదానంలో దిగితే.. కళ్లన్నీ అతడిపైనే. ఆటలో మంచి వేటగాడే కాదు.. పెద్ద బిజినెస్ మేన్ కూడా. మెస్సీ వారానికి, రోజుకు, గంటకు ఎంత సంపాదిస్తాడో తెలుసా?

మెస్సీ
మెస్సీ (twitter)

ప్రపంచమంతా ఫిఫా వరల్డ్ కప్(FIFA World Cup)ను ఎంతో ఉత్కంఠగా చూసింది. అర్జెంటీనా కప్ కొడితే.. సంతోషం వ్యక్తం చేసింది. మెస్సీకి ప్రపంచం మెుత్తం విషెస్ చెప్పింది. అందరూ మెస్సీ ఆనందాన్ని చూసి మురిసిపోయారు. దశాబ్ద కాలానికిపైగా.. ఫుట్ బాల్ ప్రేమికులను మైమరిపిస్తున్నాడు. అయితే మెస్సీ ఆటలోనే కాదు.. సంపాదనలోనూ దూసుకెళ్తాడు. అతడి ఆస్తుల విలువ తెలిస్తే.. వామ్మో అనేలా ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు

మెస్సీ ఆస్తులు, లైఫ్ స్టైల్(Life Style) వేరేలా ఉంటాయి. నవంబర్ 2022 నాటికి లియోనెల్ మెస్సీ(Lionel Messi) నికర ఆస్తుల విలువ 600 మిలియన్ డాలర్లు అంటే 4 వేల 952 కోట్లు. ప్రపంచంలో ఎక్కువ పారితోషికం పొందుతున్న అథ్లెట్లలో ఒకడిగా ఉంటాడు. ఇక అనేక బ్రాండ్లకు ప్రచారం చేస్తూ.. కోట్లలో సంపాదిస్తాడు. చాలా కంపెనీలు మెస్సీ కోసం ఎగబడుతుంటాయి.

మెస్సీ రోజు సంపాదన ఎంతో తెలుసా.. 1,05,000 డాలర్లు అంటే రూ.87 లక్షల కంటే ఎక్కువే అన్నమాట. ఈ విషయంలో మిగతా క్రీడాకారులను కూడా మెస్సీ వెనక్కు నెట్టేశాడు. గతేడాది 75 మిలియన్లు సంపాదించాడు. ఫుట్ బాల్ టీమ్ పారిస్ సెయింట్-జర్మైన్ ఇచ్చే జీతం మాత్రమే ఏడాదికి 35 మిలియన్లు. మెస్సీ వారానికి 738,000, రోజుకు 105,000, గంటకు 8,790 డాలర్లు సంపాదిస్తాడన్నమాట. బ్రాండ్ అంబాసిడర్ గా వచ్చే సంపాదన ఉండనే ఉంది.

మెస్సీకి కార్లు అంటే చాలా ఇష్టమని చెబుతుంటారు. అర్జెంటీనాలో విలాసవంతమైన బంగ్లా ఉంది. అక్కడ నో ఫ్లై జోన్(No Fly Zone). ఎన్నో లగ్జరీ ఇళ్లు ఉన్నాయి. రూ.100 కోట్లు విలువ చేసే.. ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఇందులో 16 మంది కూర్చొవచ్చు. ఇతర బిజినెస్ లు కూడా ఉన్నాయి. అతడికి ఓ హోటల్ కూడా ఉంది.

ప్రపంచంలో అత్యధికంగా సంపాదించే.. క్రీడాకారుల్లో మెస్సీ పైనే ఉంటాడు. మెస్సీ సగటున ప్రతి ఏడాది 130 మిలియన్ డాలర్లు సంపాదిస్తాడు. సుమారు రూ.1075 కోట్లు. ఇందులో 55 మిలియన్ డాలర్లు ఆటకు సంబధించినవి. మిగిలిన 75 మిలియన్ల సంపాదన ఆఫ్ ఫీల్డ్ నుంచి. క్రిప్టోకరెన్సీ ఫ్యాన్ టోకెన్ ప్లాట్ ఫారమ్ సోషియోస్ తో సంవత్సరానికి 20 మిలియన్ల భాగస్వామ్యం ఉంది. 35 సంవత్సరాలు ఎండార్స్ మెంట్, పోర్ట్ ఫోలియోలో అడిడాస్, బడ్ వైజర్, పెప్సీకోతో ఒప్పందాలు కూడా ఉన్నాయి.

మెస్సీలో దానగుణం సైతం ఎక్కువే. 2007లో యునిసెఫ్ భాగస్వామ్యంతో లియోనల్ మెస్సీ ఫౌండేషన్(Messi Foundation) మెుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా పోషకాహార లోపంతో బలహీనంగా ఉండే పిల్లలకు సాయం చేస్తుంది. 2017లో సిరియాలో 1600 మంది అనాథ పిల్లలకు మెస్సీ ఫౌండేషన్ తరగతి గదులను నిర్మించింది. సొంత డబ్బునే ఇందుకోసం మెస్సీ ఇచ్చాడు. 2019లోనూ.. కెన్యా పౌరులకు ఆహారం, నీటిని అందించేందుకు కోట్ల రూపాయలను ఫౌండేషన్ విరాళంగా అందించింది.

WhatsApp channel