తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kylian Mbappe: రూ.6.6 కోట్ల వాచ్.. రూ.2.6 కోట్ల లగ్జరీ హోటల్ సూట్.. సౌదీ క్లబ్‌కు నో చెప్పి ఎంబాపె కోల్పోయినవి ఇవీ..

Kylian Mbappe: రూ.6.6 కోట్ల వాచ్.. రూ.2.6 కోట్ల లగ్జరీ హోటల్ సూట్.. సౌదీ క్లబ్‌కు నో చెప్పి ఎంబాపె కోల్పోయినవి ఇవీ..

Hari Prasad S HT Telugu

28 July 2023, 13:55 IST

    • Kylian Mbappe: రూ.6.6 కోట్ల వాచ్.. నెలకు రూ.2.6 కోట్ల అద్దె ఉన్న ఇల్లు.. సౌదీ క్లబ్‌కు నో చెప్పి ఫ్రెండ్ ఫుట్‌బాల్ స్టార్ కైలియన్ ఎంబాపె కోల్పోయినవి ఇవీ. ఏకంగా 33.2 కోట్ల డాలర్ల (సుమారు రూ.2700 కోట్లు) బిడ్ ను అతడు కాదనుకున్న విషయం తెలిసిందే.
పీఎస్‌జీ ప్లేయర్ కైలియన్ ఎంబాపె
పీఎస్‌జీ ప్లేయర్ కైలియన్ ఎంబాపె (AFP)

పీఎస్‌జీ ప్లేయర్ కైలియన్ ఎంబాపె

Kylian Mbappe: సౌదీ అరేబియా ఆయిల్ కింగ్. లగ్జరీ లైఫ్ అంటే ఎలా ఉంటుందో అక్కడ ఉండేవాళ్లకు బాగా తెలుసు. అందులోనూ ఈ మధ్యే పెద్ద పెద్ద ఫుట్‌బాల్ ప్లేయర్స్ ను తమ దేశానికి తీసుకొస్తున్న సౌదీ క్లబ్స్.. ఈ లగ్జరీల ఆశ చూపిస్తున్నాయి. ఈ మధ్యే పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కూడా సౌదీలో అలాంటి లగ్జరీలనే అనుభవిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

అయితే ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాలర్ కైలియన్ ఎంబాపె మాత్రం సౌదీ క్లబ్ అల్ హిలాల్ కు నో చెప్పి ఈ లగ్జరీలను కోల్పోయాడు. ప్రస్తుతం పారిస్ సెయింట్-జెర్మేన్ లో ఉన్న ఎంబాపె కోసం అల్ హిలాల్ క్లబ్ ఏకంగా 33.2 కోట్ల డాలర్లు (సుమారు రూ.2700 కోట్ల) బిడ్ ఆఫర్ చేసింది. అతని సంతకాల కోసం క్లబ్ అధికారులు పారిస్ కూడా వెళ్లారు. కానీ ఎంబాపె మాత్రం సంతకాలు కాదు కదా కనీసం వాళ్లను కలవడానికి కూడా అంగీకరించలేదు.

ఎంబాపె కోల్పోయిన లగ్జరీలు ఇవీ..

ఈ భారీ బిడ్ వద్దనుకోవడం వల్ల ఎంబాపె సౌదీ క్లబ్స్ ఇచ్చే లగ్జరీలను కూడా కోల్పోయాడు. సౌదీలో సాకర్ ప్లేయర్స్ ను రాజుల్లాగా చూసుకుంటున్నాయి అక్కడి క్లబ్స్. ఈ మధ్యే సౌదీ క్లబ్ అల్ నసర్ తో ఒప్పందం కుదుర్చుకున్న క్రిస్టియానో రొనాల్డోకు ఆ క్లబ్ ఏమేం లగ్జరీలు ఇచ్చిందో డైలీ మెయిల్ పత్రిక ఓ రిపోర్ట్ లో వెల్లడించింది.

ఈ క్లబ్ రొనాల్డో వచ్చీ రాగానే అతనికి 6.3 లక్షల పౌండ్లు (సుమారు రూ.6.6 కోట్లు) విలువైన వాచ్ ఇచ్చింది. ఈ వాచ్ లో 338 వజ్రాలు పొదిగి ఉన్నాయి. అంతేకాదు ఇది 18 క్యారెట్ల వైట్ గోల్డ్ తో చేసిన వాచ్ కావడం విశేషం. ఇక రియాద్ లో నెలకు 2.5 లక్షల పౌండ్లు (సుమారు రూ.2.6 కోట్లు) అద్దె ఉండే లగ్జరీ సూట్ లో రొనాల్డో ఉంటున్నాడు. సౌదీలోనే అత్యంత ఖరీదైన హోటల్ సూట్ ఇది.

కొన్ని రోజుల కిందట మాంచెస్టర్ యునైటెడ్ మాజీ ప్లేయర్ ఒడియన్ ఇగాలో కూడా సౌదీలో ఫుట్‌బాల్ ప్లేయర్స్ కు ఎలాంటి లగ్జరీలు లభిస్తాయో చెప్పాడు. అతడు ఎంబాపెకు ఆఫర్ చేసిన క్లబ్ అల్ హిలాల్ తోనే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఓ బంగారు సింహాసనం ఉన్న లగ్జరీ ఫ్లైట్ లో తాను ఎంజాయ్ చేస్తున్న వీడియోను అతడు పోస్ట్ చేశాడు.

ఒకవేళ ఎంబాపె కూడా సౌదీ క్లబ్ కు ఓకే చెప్పి ఉంటే ఈ లగ్జరీలను అతడు కూడా ఎంజాయ్ చేసేవాడు. కానీ అతడు మాత్రం రియల్ మాడ్రిడ్ కు ఆడాలని కలలు కంటున్నాడు. అందుకే పీఎస్‌జీతో ఒప్పందం ముగిసిన తర్వాత ఫ్రీ ఏజెంట్ గా రియల్ మాడ్రిడ్ క్లబ్ కోసం ప్రయత్నించాలని భావిస్తున్నాడు.

టాపిక్

తదుపరి వ్యాసం