Kohli wanted Dhoni Captaincy: ధోనీ నుంచి కోహ్లీ కెప్టెన్సీ కావాలనుకున్నాడా? మాజీ కోచ్ శ్రీధర్ పుస్తకంలో సంచలన విషయాలు
13 January 2023, 8:44 IST
- Kohli wanted Dhoni Captaincy: 2016లో ఎంఎస్ ధోనీ నుంచి విరాట్ కోహ్లీ టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కెప్టెన్సీని కావాలనుకున్నాడట. ఈ విషయాన్ని అప్పటి ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్.. తన పుస్తకంలో రాశారు. అయితే ఆ పరిస్థితిని రవిశాస్త్రీ చక్కదిద్దినట్లు పేర్కొన్నారు.
విరాట్ కోహ్లీ-ఎంఎస్ ధోనీ
Kohli wanted Dhoni Captaincy: భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్సీ మార్పు సజావుగా జరిగిన దాఖలాలు చాలా అరుదు. అనుభవం ఉన్న వ్యక్తి ఉన్నప్పుడు బలమైన అభ్యర్థిని తీసుకోవాలనుకుంటే ఇది మరింత సంక్లిష్టంగా మారుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని హార్దిక్ పాండ్యాను పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కెప్టెన్‌గా నియమించాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా హార్దిక్ కూడా ఇందుకు సముఖంగా ఉన్నాడు. తనకు తానే టీ20 కెప్టెన్ అని హింట్ ఇచ్చుకున్నాడు. మరోపక్క అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ కూడా టీ20 భవితవ్యం గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి సమయంలో సర్వత్రా కెప్టెన్సీ మార్పుపై చర్చ జరుగుతోంది.
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా చేసిన సమయంలోనూ ఇలాంటి సమస్య తలెత్తింది. 2014-15 సీజన్‌లో ధోనీ టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పి దీర్ఘకాలం ఫార్మాట్‌కు సారథిగా కోహ్లీకి అవకాశమిచ్చాడు. ఆ తర్వాత పరిమిత ఓవర్లకు కూడా కోహ్లీనే సారథిగా నియమించాలనే వాదనలు వినిపించాయి. అలాంటి పరిస్థితి ఇరువురి బలమైన నాయకుల మధ్య పోటీ నెలకొంది. ఈ పరిస్థితిని అప్పటి కోచ్ రవిశాస్త్రీ చక్కగా సరిదిద్దారు. కోహ్లీని సరైన మార్గనిర్దేశం చేయడం ద్వారా పరిస్థితిని నైపుణ్యంగా చక్కబెట్టాడు. ఆ సమయంలో ఫీల్డింగ్ కోచ్‌గా చేసిన ఆర్ శ్రీధర్ తన కొత్త పుస్తకం కోచింగ్ "బియాండ్-మై డేస్ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్" అనే పుస్తకంలో ఈ విషయం గురించ వెల్లడించారు.
"2016లో విరాట్ కోహ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కూడా కెప్టెన్ కావాలనుకున్నాడు. ఈ విషయాన్ని కోచ్ రవిశాస్త్రీకి కూడా తెలియజేశాడు. ఓ రోజు సాయంత్రం రవిశాస్త్రీ.. కోహ్లీని పిలిచి మార్గనిర్దేశం చేశాడు. 'చూడు విరాట్.. ధోనీ నీకు టెస్టు క్రికెట్ కెప్టెన్సీ ఇచ్చాడు. అది నువ్వు గౌరవించాలి. అన్నీ సరిగ్గా ఉంటే అతడు పరిమిత ఓవర్ల సారథ్య బాధ్యతలను కూడా నీకు అప్పగిస్తాడు. రేపటి రోజున నువ్వే కెప్టెన్‌గా ఉంటావు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో సంబంధం లేకుండా అప్పటి వరకు నువ్వు అతడిని గౌరవిస్తూ ఉండు. కెప్టెన్సీ వెనక నువ్వు పరుగెత్తాల్సిన అవసరం లేదు. అదే నీ దగ్గరకు వస్తుంది.' అని రవిశాస్త్రీ కోహ్లీని గైడ్ చేసినట్లు" శ్రీధర్ తన పుస్తకంలో వెల్లడించారు.
అనుకున్నట్లే ధోనీ.. విరాట్‌కు 2017లో టీమిండియా పరిమిత ఓవర్ల సారథ్య పగ్గాలను కూడా అప్పగించాడు. అప్పటి నుంచి అతడు రిటైరయ్యేంత వరకు కోహ్లీకి కావాల్సిన ఇన్‌పుట్ ఇస్తూ అతడిని గైడ్ చేశాడు. 2022లో కోహ్లీ కెప్టెన్‌గా వైదొలిగాడు. అతడి స్థానంలో రోహిత్ శర్మకు బాధ్యతలను అప్పగించారు. 2021 టీ20 వరల్డ్ కప్ ఓటమితో కోహ్లీని తప్పించారు. అయితే అతడు అయిష్టంగానే తన బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. వన్డే ప్రపంచకప్ వరకు కెప్టెన్‌గా వ్యవహరించాలని మన రన్నింగ్ మెషిన్ కోరుకున్నాడు.