Gambhir on Dhoni: టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలిచి 12 ఏళ్లవుతోంది. ఇప్పుడు మరోసారి వరల్డ్‌కప్ ఏడాదిలోకి క్రికెట్ ప్రపంచం అడుగుపెట్టింది. అయితే 2011లో వరల్డ్‌కప్ గెలిచినప్పటి ఆసక్తికర విషయాలు ఇప్పటికీ బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ వరల్డ్‌కప్ విజయంలో కీలకపాత్ర పోషించిన ప్లేయర్స్‌లో ఒకడైన గౌతమ్ గంభీర్ మరో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు.,ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి ఇండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఫైనల్లో ఓపెనర్ గంభీర్ 97 రన్స్ చేశాడు. అయితే ఫైనల్లో సెంచరీ చేసే అవకాశం మిస్ అయినా.. తాను మూడంకెల స్కోరు అందుకోవాలని ధోనీ కోరుకున్నట్లు గంభీర్ చెప్పాడు. ఆ మ్యాచ్‌లో ఇండియా ముందు శ్రీలంక 275 రన్స్ టార్గెట్ విధించింది.,అయితే రెండో బంతికే సెహ్వాగ్ ఔటయ్యాడు. ఆ తర్వాత సచిన్, విరాట్ కోహ్లి కూడా త్వరగానే ఔటయ్యారు. ఈ పరిస్థితుల్లో ధోనీతో కలిసి గంభీర్ నాలుగో వికెట్‌కు 109 రన్స్ జోడించాడు. అతడు ఇండియాను విజయం వైపు నడిపించాడు కానీ.. సెంచరీ మాత్రం చేయలేకపోయాడు. వరల్డ్‌కప్ ఫైనల్లో సెంచరీ చేసిన తొలి ఇండియన్ బ్యాటర్‌గా నిలవడానికి కేవలం మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.,అయితే తాను సెంచరీ చేయడానికి ధోనీ చాలా ప్రోత్సహించినట్లు తాజాగా గంభీర్ చెప్పాడు. "ఎమ్మెస్ ధోనీ చాలా సోపోర్టివ్‌గా నిలిచాడు. నేను సెంచరీ చేయాలని అతడు అనుకున్నాడు. ఎప్పుడూ అతడు అదే అనుకున్నాడు. అవసరమైతే నేను రిస్క్ తీసుకుంటాను. నువ్వు తొందర పడకు. నీ సెంచరీ చేసుకో అని ఓవర్ల మధ్యలో ధోనీ నాతో అన్నాడు" అని గంభీర్ చెప్పాడు.,గంభీర్ 97 రన్స్ చేసి ఔటైనా.. యువరాజ్‌తో కలిసి ధోనీ ఇండియాను గెలిపించాడు. ధోనీ విన్నింగ్ సిక్స్ ఇప్పటికీ అభిమానుల మదిలో అలా నిలిచిపోయింది. చివరికి ధోనీ కూడా 91 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.,