IND Vs SL 1st ODI : మెుదటి వన్డేలో శ్రీలంకపై భారత్ ఘన విజయం
IND Vs SL 1st ODI Highlights : భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన మెుదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో సూపర్ విక్టరీ నమోదు చేసింది.
India Beat Sri Lanka In 1st ODI : గౌహతి బర్సాపురా స్టేడియం వేదికగా.. జరిగిన మెుదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. అద్భుత ప్రదర్శనతో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది టీమిండియా. పూర్తి ఆదిపత్యం చెలాయించింది. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు అద్భుత ఆరంభాన్ని ఇచ్చేశారు.
ఓపెనర్లు రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) మంచి ఆరంభం ఇచ్చారు. ఇద్దరూ తొలి వికెట్‌కు 143 రన్స్ జోడించిన తర్వాత గిల్ ఔటయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన విరాట్ మొదటి నుంచీ చాలా కాన్ఫిడెంట్‌గా ఆడాడు. చివరికి 87 బంతుల్లోనే 113 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
అంతకుముందు రోహిత్ కూడా ధాటిగా ఆడాడు. వన్డేల్లో తన 30వ సెంచరీకి 17పరుగుల దూరంలో ఔటయ్యాడు. రోహిత్ కేవలం 67 బాల్స్‌లోనే 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 83 రన్స్ చేశాడు. ఇక గిల్ కూడా 60 బాల్స్‌లోనే 11 ఫోర్లతో 70 రన్స్ చేశాడు. గిల్ తన ఇన్నింగ్స్‌లో రెండుసార్లు వరుసగా మూడు ఫోర్లు కొట్టడం విశేషం. శ్రేయస్ అయ్యర్ (24 బంతుల్లో 28), కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 39) కూడా బాగానే ఆడినా.. తమ స్కోర్లను భారీగా మలచలేకపోయారు.
భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల స్కోర్ చేసింది. లంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు తీశాడు. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్ తీశారు.
శ్రీలంక ఎదుట భారత్ భారీ లక్ష్యాన్ని పెట్టింది. శ్రీలంక బ్యాట్స్ మెన్స్ భారత్ పేసర్ల దాటికి క్రీజ్ లో నిలవలేదు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్ 2, మహమ్మద్ షమీ 1, హార్థిక్ పాండ్యా 1, చాహల్ 1 వికెట్ తీశారు. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది శ్రీలంక. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి.. 306 పరుగులు చేసింది. కెప్టెన్ దాసున్ షనక 108 పరుగులతో ఆకట్టుకున్నాడు. చివరి వరకూ పోరాటం చేసినా జట్టును విజయం వైపు తీసుకెళ్లలేదు. షనకతోపాటుగా ఓపెనర్ నిస్సాంక 72 పరుగులు చేశాడు. రెండో వన్డే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జనవరి 12న జరుగుతుంది.
సంబంధిత కథనం