తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kohli On Smith: ఈ జనరేషన్ బెస్ట్ టెస్ట్ ప్లేయర్ అతడే.. స్మిత్‌పై కోహ్లి ప్రశంసల వర్షం

Kohli on Smith: ఈ జనరేషన్ బెస్ట్ టెస్ట్ ప్లేయర్ అతడే.. స్మిత్‌పై కోహ్లి ప్రశంసల వర్షం

Hari Prasad S HT Telugu

08 June 2023, 10:29 IST

google News
    • Kohli on Smith: ఈ జనరేషన్ బెస్ట్ టెస్ట్ ప్లేయర్ అతడే అంటూ స్మిత్‌పై కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి రోజు స్మిత్ 95 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందే విరాట్ ఈ కామెంట్స్ చేయడం విశేషం.
స్టీవ్ స్మిత్
స్టీవ్ స్మిత్ (AFP)

స్టీవ్ స్మిత్

Kohli on Smith: ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటర్ విరాట్ కోహ్లి అని అంటారు. కానీ అలాంటి కోహ్లి కూడా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ జనరేషన్ లో బెస్ట్ టెస్ట్ బ్యాటర్ అతడే అని స్పష్టం చేశాడు. టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న తీరు, నమ్మశక్యం కాని సగటుతో చేస్తున్న పరుగులు కోహ్లిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి రోజు కూడా స్మిత్ 95 పరుగులతో అజేయంగా నిలిచాడు. హెడ్ (146 నాటౌట్)తో కలిసి ఆస్ట్రేలియాను భారీ స్కోరు వైపు నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభానికి ముందు స్మిత్ పై కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గత పదేళ్లలో స్మిత్ ఆడినట్లుగా మరెవరూ టెస్ట్ క్రికెట్ ఆడలేదని విరాట్ అనడం గమనార్హం.

"నా అభిప్రాయం ప్రకారం.. ఈ జనరేషన్ లో స్టీవ్ స్మిత్ బెస్ట్ టెస్ట్ ప్లేయర్. అతడు దానిని నిరూపించాడు. కండిషన్స్ కు తగినట్లు తనను తాను మార్చుకోవడం అద్భుతం. ఈ జనరేషన్ లో ఏ క్రికెటర్ ను అయినా తీసుకోండి. ప్రతి ఒక్కరికీ అతని రికార్డు తెలుసు.

85-90 టెస్టుల తర్వాత కూడా 60 సగటుతో పరుగులు చేయడం నమ్మశక్యం కానిది. అతని నిలకడ, పరుగులు చేసే తీరు చూస్తే.. గత పదేళ్లలో ఏ ఇతర టెస్ట్ ప్లేయర్ ఇలా ఆడటం నేను చూడలేదు. అది అతని నైపుణ్యానికి నిదర్శనం" అని స్టార్ స్పోర్ట్స్ తో విరాట్ అన్నాడు.

ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు వరకూ స్టీవ్ స్మిత్ 96 టెస్టుల్లో 59.80 సగటుతో 8792 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదే కోహ్లి విషయానికి వస్తే అతడు ఇప్పటి వరకూ 108 టెస్టుల్లో 48.93 సగటుతో 8416 పరుగులు చేశాడు. అందులో 28 సెంచరీలు, 28 హాప్ సెంచరీలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం