తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Jonny Bairstow: బెయిర్‌స్టో అలా దొరికిపోయాడు.. అదును చూసి షాకిచ్చిన కేరీ.. ఇప్పుడుడేమంటారు మరి.. వీడియో వైరల్

Jonny Bairstow: బెయిర్‌స్టో అలా దొరికిపోయాడు.. అదును చూసి షాకిచ్చిన కేరీ.. ఇప్పుడుడేమంటారు మరి.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu

06 July 2023, 10:30 IST

google News
    • Jonny Bairstow: బెయిర్‌స్టో ఇలా దొరికిపోయాడు. నిజానికి అదును చూసి అతనికి షాకిచ్చాడు అలెక్స్ కేరీ. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఇంగ్లండ్ ఇది అన్యాయం అని వాదిస్తున్న వేళ ఈ వీడియో వాళ్లను డిఫెన్స్ లోకి పడేస్తోంది.
జానీ బెయిర్ స్టో వికెట్ తీసిన ఆనందంలో ఆస్ట్రేలియా ప్లేయర్స్
జానీ బెయిర్ స్టో వికెట్ తీసిన ఆనందంలో ఆస్ట్రేలియా ప్లేయర్స్ (Action Images via Reuters)

జానీ బెయిర్ స్టో వికెట్ తీసిన ఆనందంలో ఆస్ట్రేలియా ప్లేయర్స్

Jonny Bairstow: యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ లో ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో ఔటైన విధానంపై ఇప్పటికీ దుమారం రేగుతున్న విషయం తెలుసు కదా. ఇది అన్యాయమంటూ ఇంగ్లండ్ వాదిస్తుంటే.. అందులో అన్యాయం ఎక్కడుందని ఆస్ట్రేలియా ప్రశ్నిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన వీడియో ఆస్ట్రేలియా వాదనకు బలం చేకూరుస్తోంది.

బెయిర్‌స్టోను అలెక్స్ కేరీ అదును చూసి ఎలా దెబ్బ కొట్టాడో ఆ వీడియో చూస్తే స్పష్టమవుతోంది. బెయిర్‌స్టో తరచూ క్రీజు దాటడం చూసిన తర్వాతే కేరీ ఇలా చేసినట్లు కనిపిస్తోంది. అంతకుముందు బెయిర్‌స్టో కనీసం వెనక్కి చూడకుండా రెండుసార్లు క్రీజు దాటాడు. మూడోసారి అలాగే చేయబోతే కేరీ బంతిని ఫీల్డర్ వైపు కాకుండా వికెట్ల వైపు విసిరాడు.

అది కాస్తా స్టంప్స్ కు తగిలి బెయిర్‌స్టో ఔటయ్యాడు. నిజానికి నిబంధనల ప్రకారం ఆస్ట్రేలియా వికెట్ కీపర్ కేరీ చేసినదాంట్లో తప్పేమీ లేదు. తన చేతిలో బంతి పడిన వెంటనే స్టంప్స్ వైపు విసిరాడు. ఆ లెక్కన ఓవర్ ముగిసినా బంతి డెడ్ కానట్లే. అయితే కేరీ అలా ఎందుకు చేశాడో తాజా వీడియో ద్వారా స్పష్టమైంది. బెయిర్‌స్టో పదే పదే క్రీజు వీడటం గమనించే కేరీ వల వేసి వికెట్ దొరకబుచ్చుకున్నాడు.

క్రీడాస్ఫూర్తిని ఇంగ్లండ్ తెరపైకి తీసుకొస్తున్నా.. ఈ విషయంలో అది కూడా తప్పే. క్రికెట్ లో పాటించాల్సిన కనీస నియమాన్ని కూడా బెయిర్‌స్టో పట్టించుకోలేదు. అది కచ్చితంగా అతని పొరపాటే. అందుకే ఇన్ని విమర్శలు వస్తున్నా.. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెనక్కి తగ్గలేదు. మరోసారి ఆ అవకాశం వచ్చినా కచ్చితంగా ఔట్ చేస్తామని మూడో టెస్ట్ ప్రారంభానికి ముందు కమిన్స్ అనడం గమనార్హం.

తదుపరి వ్యాసం