తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  John Cena Retirement: అదే నా చివరి ఫైట్.. రెజ్లింగ్‌కు గుడ్ బై చెప్పనున్న ఛాంపియన్ రెజ్లర్ జాన్ సీనా

John Cena retirement: అదే నా చివరి ఫైట్.. రెజ్లింగ్‌కు గుడ్ బై చెప్పనున్న ఛాంపియన్ రెజ్లర్ జాన్ సీనా

Hari Prasad S HT Telugu

07 July 2024, 16:43 IST

google News
    • John Cena retirement: రెజ్లింగ్ కు స్టార్ రెజ్లర్ జాన్ సీనా గుడ్ బై చెప్పనున్నాడు. వచ్చే ఏడాది జరగబోయే రెజిల్‌మేనియానే తన కెరీర్లో చివరి ఫైట్ అని 47 ఏళ్ల రెజ్లర్ చెప్పడం విశేషం.
అదే నా చివరి ఫైట్.. రెజ్లింగ్‌కు గుడ్ బై చెప్పనున్న ఛాంపియన్ రెజ్లర్ జాన్ సీనా
అదే నా చివరి ఫైట్.. రెజ్లింగ్‌కు గుడ్ బై చెప్పనున్న ఛాంపియన్ రెజ్లర్ జాన్ సీనా (WWE)

అదే నా చివరి ఫైట్.. రెజ్లింగ్‌కు గుడ్ బై చెప్పనున్న ఛాంపియన్ రెజ్లర్ జాన్ సీనా

John Cena retirement: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) లెజెండ్ జాన్ సీనా తాను రిటైర్ కాబోతున్నట్లు వెల్లడించాడు. 16సార్లు ఛాంపియన్ అయిన ఈ స్టార్ ప్రొఫెషనల్ రెజ్లర్, డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్ కెనడాలో జరిగిన మనీ ఇన్ ద బ్యాంక్ పే పర్ వ్యూలోకి అనూహ్యంగా వచ్చి తన రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి చెప్పాడు.

జాన్ సీనా రిటైర్మెంట్

తన ప్రొఫెషనల్ రెజ్లింగ్ లో 2025 చివరి ఏడాది కానుందని జాన్ సీనా చెప్పాడు. వచ్చే ఏడాది తన చివరి రింగ్ మ్యాచ్ తలపడటానికి ముందు కొన్ని ఫైట్ లలో అతడు భాగం కానున్నాడు. వచ్చే ఏడాది రా(RAW) తొలి ఎపిసోడ్లోనే అతడు ఫైట్ చేయనున్నాడు. నెట్‌ఫ్లిక్స్ లో డబ్ల్యూడబ్ల్యూఈ వచ్చేది కూడా ఈ ఎపిసోడ్ తోనే. ఆ తర్వాత ఫిబ్రవరిలో రాయల్ రంబుల్, మార్చిలో ఎలిమినేషన్ ఛాంబర్ లో పాల్గొన్న తర్వాత లాస్ వెగాస్ లో జరగబోయే రెజిల్‌మేనియా తన కెరీర్లో చివరిదని అతడు స్పష్టం చేశాడు.

"ఈరోజు నేను అధికారికంగా డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి నా రిటైర్మెంట్ గురించి అనౌన్స్ చేస్తున్నాను" అని జాన్ సీనా చెప్పాడు. దీనికి సంబంధించిన ప్రోమోను డబ్ల్యూడబ్ల్యూఈ క్రియేటివ్ హెడ్ ట్రిపుల్ హెచ్ షేర్ చేశాడు. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ అనే క్యాప్షన్ తాను సీనాను హగ్ చేసుకుంటున్న క్లిప్ ను దీనికి జోడించాడు. రెజిల్‌మేనియా తర్వాత రింగులో సీనా ఫైట్స్ ఇక ఉండవు.

23 ఏళ్ల కెరీర్‌కు ఫుల్‌స్టాప్

జాన్ సీనా రిటైర్మెంట్ ప్రకటనతో అతని 23 ఏళ్ల కెరీర్ కు ఫుల్‌స్టాప్ పడనుంది. తన కెరీర్లో అతడు 13సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్, మూడుసార్లు వరల్డ్ హెవీవెయిట్ టైటిల్స్ గెలిచాడు. డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలో అత్యధిక టైటిల్స్ గెలిచిన వాళ్లలో రిక్ ఫ్లెయిర్ సరసన అతడు నిలిచాడు. 2018 నుంచి యువకులకు అవకాశం ఇవ్వడానికంటూ అతడు అప్పుడప్పుడు మాత్రమే ఫైట్స్ చేస్తున్నాడు.

అతని చివరి మ్యాచ్ గతేడాది ఆడాడు. అందులో సోలో సికోవా చేతుల్లో ఓడిపోయాడు. 2017లో చివరిసారి రెజిల్‌మేనియా గెలిచిన జాన్ సీనా.. తన చివరి టోర్నీలో ఏం చేస్తాడో అన్న ఆసక్తి నెలకొంది. 2001లో జాన్ సీనా డబ్ల్యుడబ్ల్యుఈలోకి ఎంట్రీ ఇచ్చాడు. రాండీ ఆర్టాన్, డేవ్ బటిస్టా, బ్రోక్ లెస్నర్ లాంటి వాళ్లంతా అదే సమయంలో రెజ్లింగ్ కు వచ్చిన వాళ్లే.

టాపిక్

తదుపరి వ్యాసం