తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Zaheer On Umran Malik: ఉమ్రాన్‌ను సన్‌రైజర్స్ సరిగ్గా ఉపయోగించుకోలేదు.. తగిన మద్దతు ఇవ్వలేదు.. జహీర్ స్పష్టం

Zaheer on Umran Malik: ఉమ్రాన్‌ను సన్‌రైజర్స్ సరిగ్గా ఉపయోగించుకోలేదు.. తగిన మద్దతు ఇవ్వలేదు.. జహీర్ స్పష్టం

18 May 2023, 20:13 IST

    • Zaheer on Umran Malik: సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఈ ఏడాది పెద్దగా ప్రభావం చూపని సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించిన జహీర్ ఖాన్.. ఉమ్రాన్‌ను సన్‌రైజర్స్ సరిగ్గా ఉపయోగించుకోలేదని స్పష్టం చేశాడు.
ఉమ్రాన్ మాలిక్
ఉమ్రాన్ మాలిక్ (PTI)

ఉమ్రాన్ మాలిక్

Zaheer on Umran Malik: గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఉమ్రాన్ మాలిక్ ఈ ఏడాది మాత్రం తేలిపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సూపర్ ఫామ్‌తో రాణించిన ఈ యువ పేసర్.. జాతీయ జట్టులో కూడా స్థానాన్ని సంపాదించాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఏడు మ్యాచ్‌ల్లో కేవలం 5 వికెట్లు తీసిన అతడు.. భారీగ పరుగులు సమర్పించుకున్నాడు. ఓవర్‌కు 10.35 పరుగులు చొప్పున సమర్పించాడు. ఈ పేలవ ప్రదర్శనతో సన్ రైజర్స్ జట్టులో చోటు కూడా కోల్పోయాడు. అతడు చివరగా ఏప్రిల్ 29న ఆడాడు. తాజాగా ఉమ్రాన్ మాలిక్ ప్రదర్శనపై టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ స్పందించాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"ఉమ్రాన్ మాలిక్‌ను అతడి ఫ్రాంఛైజీ సరిగ్గా వాడుకోలేదని నేను అనుకుంటున్నాను. అతడితో ఎలా ఆడించాలి? ఎలాంటి ప్రదర్శన రాబట్టుకోవాలి? ఎలా ఉపయోగించుకోవాలి? అనే విషయంలో సన్‌రైజర్స్ లోపం స్పష్టంగా కనిపించింది." అని జహీర్ ఖాన్ అన్నాడు.

ఉమ్రాన్ మాలిక్‌కు సరైన గైడెన్స్ లేదని జహీర్ వ్యాఖ్యానింాడు.

"ఉమ్రాన్ మాలిక్ విషయానికొస్తే.. అతడి తగిన వాతావరణం, సపోర్టును సృష్టించాలి. అంతేకాకుండా అతడికి సరైన గైడెన్స్, మార్గనిర్దేశం అవసరం. దురదృష్టవశాత్తూ సన్ రైజర్స్ నుంచి అలాంటి మద్దతు లభించలేదు. అందుకే ఈ సీజన్‌లో అతడు ఘోరంగా విఫలమయ్యాడు." అని జహీర్ ఖాన్ అన్నాడు.

ఇదే విషయాన్ని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా తెలిపాడు. జమ్మూ-కశ్మీర్‌ తరఫున ఉమ్రాన్ ప్రదర్శన చూసిన ఇర్ఫాన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉమ్రాన్‌కు సరైన సపోర్ట్ ఇవ్వలేదని అభిప్రాయపడ్డాడు. లీగ్‌లో ఓ మంచి ఫాస్ట్ బౌలర్ బెంచ్‌కు పరిమితమవడం తనను కలవరపెడుతోందని ట్వీటర్ వేదికగా తెలియజేశాడు.